Share News

ఏప్రిల్‌ నుంచి కొత్త టీడీఎస్‌ నిబంధనలు

ABN , Publish Date - Mar 16 , 2025 | 04:57 AM

ఏప్రిల్‌ 1 నుంచి మూలంలో పన్ను కోత (టీడీఎ్‌స)కు సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. ఈ నిబంధనలు సీనియర్‌ సిటిజన్లతో పాటు సాధారణ పన్ను చెల్లింపుదారులకూ మేలు చేయనున్నాయి...

ఏప్రిల్‌ నుంచి కొత్త టీడీఎస్‌ నిబంధనలు

సీనియర్‌ సిటిజన్లకు మరింత ఊరట

ఏప్రిల్‌ 1 నుంచి మూలంలో పన్ను కోత (టీడీఎ్‌స)కు సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. ఈ నిబంధనలు సీనియర్‌ సిటిజన్లతో పాటు సాధారణ పన్ను చెల్లింపుదారులకూ మేలు చేయనున్నాయి. లాటరీల్లో జాక్‌పాట్‌ కొట్టే వాళ్లు, బీమా ఏజెంట్లపైనా కొత్త నిబంధనలతో టీడీఎస్‌ భారం తగ్గనుంది. దీనికి సంబంఽధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

2025-26 కేంద్ర బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ టీడీఎస్‌కు సంబంధించి పలు మార్పులు ప్రకటించారు. దీంతో ఆదాయ పన్ను (ఐటీ) చెల్లింపుదారులకు ముఖ్యంగా సీనియర్‌ సిటిజన్లకు చాలా మేలు జరగనుంది. కమిషన్‌ ఏజెంట్లు, ఇన్వెస్టర్లకి కూడా ఈ కొత్త నిబంధనలు మేలు చేయనున్నాయి. ఈ మార్పులు ఏంటంటే ?


2-2-Buss.gif

సీనియర్‌ సిటిజన్లకు: మధ్య తరగతి ప్రజలు, సీనియర్‌ సిటిజన్ల చేతిలో మరిన్ని డబ్బులు ఉంచాలన్నది 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ ప్రధాన లక్ష్యం. ఇందుకోసం టీడీఎస్‌ పరిధిలోకి వచ్చే సీనియర్‌ సిటిజన్ల వార్షిక వడ్డీ ఆదాయాన్ని ఆర్థిక మంత్రి రెట్టింపు చేశారు. ఏప్రిల్‌ 1 నుంచి ఒక బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు (ఎఫ్‌డీ), రికరింగ్‌ డిపాజిట్ల (ఆర్‌డీ)పై వీరికి వచ్చే వార్షిక వడ్డీ ఆదాయం రూ.లక్ష లోపు ఉంటే ఆ ఆదాయానికి టీడీఎస్‌ వర్తించదు.

సాధారణ ప్రజలకూ ఊరట: సాధారణ ప్రజల వడ్డీ ఆదాయానికీ మొన్నటి కేంద్ర బడ్జెట్‌లో కొద్దిగా ఊరట లభించింది. 2025 ఏప్రిల్‌ 1 నుంచి ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక నాన్‌-సీనియర్‌ సిటిజన్‌ వార్షిక వడ్డీ ఆదాయం రూ.50,000 మించకుండా ఉంటే బ్యాంకులు, ఆ వడ్డీ ఆదాయంపై టీడీఎస్‌ కట్‌ చేయవు.


లాటరీ టిక్కెట్లు, గుర్రప్పందాల ఆదాయం: లాటరీ టిక్కెట్లు, క్రాస్‌వర్డ్‌ పజిల్స్‌, గుర్రప్పందాల జాక్‌పాట్‌ ఆదాయానికి ఏపిల్‌ 1 నుంచి కొద్దిగా ఉపశమనం లభించనుంది. గతంలో ఒక ఆర్థిక సంవత్సరంలో ఈ మార్గాల్లో వచ్చే మొత్తం ఆదాయం రూ.10,000 మించితే టీడీఎస్‌ పడేది. ఇప్పుడు నిబంధనలు మార్చి ఒక్కో దానిపై వచ్చే వార్షిక ఆదాయం రూ.10,000 మించకుండా ఉంటే చాలని స్పష్టం చేశారు. అంటే ఒక వ్యక్తికి ఒక ఆర్థిక సంవత్సరంలో లాటరీ టిక్కెట్‌పై రూ.8,000, క్రాస్‌ వర్ద్‌ పజిల్‌ ద్వారా రూ.8,000, గుర్రప్పందంపై బెట్టింగ్‌ ద్వారా రూ.8,000 ఆదాయం వచ్చిందనుకున్నాం. పాత నిబంధనల ప్రకారం ఈ మూడింటిని కలిపి రూ.10,000కు మించిన ఆదాయంపై టీడీఎస్‌ కట్‌ అయ్యేది. ఇప్పుడు ఒక్కోదానిపై రూ.8,000 చొప్పున రూ.24,000 వార్షిక ఆదాయం వచ్చినా పైసా టీడీఎస్‌ కూడా కట్‌ కాదు.


బీమా ఏజెంట్లు, బ్రోకర్లకూ ఊరట: వివిధ రకాల కమిషన్ల ఆదాయానికి సంబంధించిన టీడీఎస్‌ నిబంధనలనూ బడ్జెట్‌లో సవరించారు. గతంలో ఈ వార్షిక కమిషన్‌ ఆదాయం రూ.15,000 మించితే టీడీఎస్‌ వర్తించేది. ఇప్పుడు ఆ పరిమితిని రూ.20,000కు పెంచారు. బీమా ఏజెంట్లు, స్టాక్‌ బ్రోకర్లకు ఇది ఎంతో కొంత మేలు చేస్తుందనడంలో సందేహం లేదు.

ఎంఎ్‌ఫలు, షేర్లపై టీడీఎస్‌: మ్యూచువల్‌ ఫండ్‌ (ఎంఎఫ్‌) సంస్థలు, కంపెనీల నుంచి యూనిట్‌ హోల్డర్లు, వాటాదారులకు అందే వార్షిక డివిడెండ్‌ ఆదాయం గతంలో రూ.5,000 మించితే టీడీఎస్‌ వర్తించేది. ఏప్రిల్‌ 1 నుంచి ఈ మినహాయింపు పరిమితి రూ.10,000కు పెరగనుంది.

ఇవి కూడా చదవండి:

Samsung: శాంసంగ్ నుంచి మార్కెట్లోకి కొత్త 5జీ ఫోన్..ఏకంగా ఆరేళ్లపాటు..

Gold Silver Rates Today: భయపెడుతున్న బంగారం, వెండి ధరలు.. ఎంతకు చేరాయంటే..

Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 16 , 2025 | 04:57 AM