Share News

NCC Limited: తగ్గిన ఎన్‌సీసీ లాభం

ABN , Publish Date - Aug 06 , 2025 | 01:37 AM

ఎన్‌సీసీ లిమిటెడ్‌.. జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన

NCC Limited: తగ్గిన ఎన్‌సీసీ లాభం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఎన్‌సీసీ లిమిటెడ్‌.. జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.5,207.93 కోట్ల టర్నోవర్‌పై రూ.192.14 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ ఆదాయం రూ.5,558.33 కోట్లుగా ఉండగా లాభం రూ.209.92 కోట్లుగా ఉంది. సమీక్షా త్రైమాసికంలో కంపెనీ కొత్తగా రూ.3,658 కోట్ల ఆర్డర్లను దక్కించుకుంది. దీంతో కంపెనీ ఆర్డర్‌ బుక్‌ రూ.70,087 కోట్లకు చేరుకుంది. కాగా జూన్‌ త్రైమాసికంలో కంపెనీ రూ.4,429.64 కోట్ల స్టాండ్‌ఎలోన్‌ ఆదాయంపై రూ.190.10 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.

Updated Date - Aug 06 , 2025 | 01:37 AM