NBFC Bajaj Finance: పండగల సీజన్‌లో రుణ వితరణ అదుర్స్
ABN , Publish Date - Nov 05 , 2025 | 06:13 AM
ఈ ఏడాది పండగల సీజన్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (ఎన్‌బీఎ్‌ఫసీ)లకూ బాగానే కలిసొచ్చింది. బజాజ్ ఫైనాన్స్ ఈ ఏడాది సెప్టెంబరు 22 నుంచి అక్టోబరు 26 మధ్య కాలంలో రికార్డు స్థాయిలో...
న్యూఢిల్లీ: ఈ ఏడాది పండగల సీజన్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (ఎన్‌బీఎ్‌ఫసీ)లకూ బాగానే కలిసొచ్చింది. బజాజ్ ఫైనాన్స్ ఈ ఏడాది సెప్టెంబరు 22 నుంచి అక్టోబరు 26 మధ్య కాలంలో రికార్డు స్థాయిలో దాదాపు 63 లక్షల రుణాలు మంజూరు చేసింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది విలువపరంగా 29 శాతం, పరిమాణపరంగా 27 శాతం ఎక్కువని తెలిపింది. జీఎ్‌సటీ 2.0 సంస్కరణలు, కేంద్ర బడ్జెట్‌లో ఆదాయ పన్ను తగ్గించడం ఇందుకు ప్రధాన కారణమని బజాజ్ ఫైనాన్స్ చైర్మన్ సంజీవ్ బజాజ్ తెలిపారు. ఈ ఏడాది పండగల సీజన్‌లో 23 లక్షల మంది కొత్త ఖాతాదారులు కంపెనీ నుంచి రుణాలు తీసుకున్నారు. వీరిలో 52 శాతం మంది జీవితంలో తొలిసారి రుణాలు తీసుకున్న వ్యక్తులని బజాజ్ ఫైనాన్స్ తెలిపింది.
ఇవీ చదవండి:
ఈ పని చేయకుంటే.. జనవరి నుంచి పాన్ కార్డు డీయాక్టివేట్!
మెంబర్ పోర్టల్‌లోనే పాస్ బుక్.. ఈపీఎఫ్ఓ కొత్త ఫీచర్
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి