నాట్కో షేరు 20% పతనం
ABN , Publish Date - Feb 14 , 2025 | 01:16 AM
హైదరాబాద్‌కు చెందిన నాట్కో ఫార్మా లిమిటెడ్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మార్కెట్ వర్గాలను నిరాశపరచడంతో కంపెనీ షేరు ఏకంగా 19.99 శాతం...

హైదరాబాద్‌కు చెందిన నాట్కో ఫార్మా లిమిటెడ్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మార్కెట్ వర్గాలను నిరాశపరచడంతో కంపెనీ షేరు ఏకంగా 19.99 శాతం పతనమై రూ.973.40 వద్దకు జారుకుంది. దాంతో కంపెనీ మార్కెట్ విలువ ఒక్క రోజులోనే రూ.4,356.85 కోట్లు తగ్గి రూ.17,434.55 కోట్లకు పడిపోయింది.