తగ్గిన నాట్కో ఫార్మా లాభం
ABN , Publish Date - Feb 13 , 2025 | 05:36 AM
నాట్కో ఫార్మా.. డిసెంబరుతో ముగిసిన తృతీయ త్రైమాసికంలో రూ.132.40 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికం...

ఒక్కో షేరుకు 75% మధ్యంతర డివిడెండ్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): నాట్కో ఫార్మా.. డిసెంబరుతో ముగిసిన తృతీయ త్రైమాసికంలో రూ.132.40 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికం (రూ.212.70 కోట్లు)తో పోల్చితే లాభం 37.75 శాతం తగ్గింది. ఫార్ములేషన్స్ ఎగుమతులు తగ్గటం పనితీరుపై ప్రభావం చూపించిందని కంపెనీ పేర్కొంది. త్రైమాసిక సమీక్షా కాలంలో మొత్తం రెవె న్యూ కూడా రూ.795.60 కోట్ల నుంచి రూ.651.10 కోట్లకు తగ్గింది. ఈ కాలంలో ఫార్ములేషన్స్ ఎగుమతులు రూ.605.60 కోట్ల నుంచి రూ.285.80 కోట్లకు తగ్గగా ఏపీఐ వ్యాపారం రూ.46.30 కోట్ల నుంచి రూ. 66.60 కోట్లకు పెరిగినట్లు పేర్కొంది. దేశీయ ఫార్ములేషన్స్ వ్యాపారం కూడా రూ.99.40 కోట్ల నుంచి రూ.96.10 కోట్లకు తగ్గాయి. కాగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ డైరెక్టర్ల బోర్డు మూడోసారి మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. రూ.2 ముఖ విలువ కలిగిన ప్రతి షేరుకు రూ.1.50 (75ు) మధ్యంతర డివిడెండ్‌ను అందించనున్నట్లు తెలిపింది. డివిడెండ్ చెల్లింపునకు రికార్డు తేదీగా ఈ నెల 18ని ఖరారు చేయగా.. చెల్లింపులు 28వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు నాట్కో వెల్లడించింది.
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: ప్రాధాన్యత తెలియని వ్యక్తులు పాలన చేస్తే..
Also Read: తిరుపతిలో తొక్కిసలాటపై సీబీఐ విచారణ.. హైకోర్టు కీలక నిర్ణయం
Also Read: సీఎం సంచలన నిర్ణయం.. కమల్ హాసన్‌కి కీలక పదవి
Also Read: మరోసారి కుల గణన సర్వే
Also Read: చంద్రబాబుపై ఆ కేసు ఎందుకు పెట్టకూడదు
Also Read: బెజవాడలో భారీ అగ్నిప్రమాదం.. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం
For AndhraPradesh News And Telugu News