Share News

చంద్రశేఖరన్‌కు నైట్‌హుడ్‌ అవార్డు

ABN , Publish Date - Feb 15 , 2025 | 05:45 AM

టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌కు బ్రిటన్‌ గౌరవ నైట్‌హుడ్‌ అవార్డు అందచేసింది. భారత-బ్రిటన్‌ వ్యాపార సంబంధాల పటిష్ఠతకు కృషి చేసినందుకుగాను చంద్ర ఈ అవార్డును కింగ్‌ చార్లెస్‌

చంద్రశేఖరన్‌కు నైట్‌హుడ్‌ అవార్డు

న్యూఢిల్లీ: టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌కు బ్రిటన్‌ గౌరవ నైట్‌హుడ్‌ అవార్డు అందచేసింది. భారత-బ్రిటన్‌ వ్యాపార సంబంధాల పటిష్ఠతకు కృషి చేసినందుకుగాను చంద్ర ఈ అవార్డును కింగ్‌ చార్లెస్‌ నుంచి అందుకున్నట్టు టాటా గ్రూప్‌ ఒక ఎక్స్‌ పోస్ట్‌లో తెలిపింది. చంద్ర దీనికి స్పందిస్తూ.. తమ గ్రూప్‌కి అందిస్తున్న ప్రోత్సాహానికి బ్రిటిష్‌ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. యూకేలో తమ గ్రూప్‌ కార్యకలాపాలు మరింత పటిష్ఠం చేసేందుకు తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Updated Date - Feb 15 , 2025 | 05:45 AM