Data Center Project : ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్!
ABN , Publish Date - Jan 25 , 2025 | 05:18 AM
భారత కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో కృత్రిమ మేథ (ఏఐ)

3 గిగావాట్ల సామర్థ్యం.. రూ.2.58 లక్షల కోట్ల పెట్టుబడులు
గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఏర్పాటుకు రిలయన్స్ ప్రణాళిక
న్యూఢిల్లీ: భారత కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో కృత్రిమ మేథ (ఏఐ) సామర్థ్యాలతో కూడిన మెగా డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు బ్లూంబర్గ్ కథనం పేర్కొంది. ప్రస్తుతం దేశంలోని డేటా సెంటర్ల మొత్తం సామర్థ్యం ఒక గిగావాట్ లోపే. రిలయన్స్ ఏకంగా 3 గిగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టు వ్యయం 2,000-3,000 కోట్ల డాలర్ల (రూ.1.72-2.58 లక్షల కోట్లు) స్థాయిలో ఉండవచ్చని అంచనా. అంతేకాదు, సామర్థ్యం పరంగా, ప్రపంచంలో ఇదే అతిపెద్ద డేటా సెంటర్ కానుంది. జామ్‌నగర్‌లో రిలయన్స్‌కు చెందిన ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్దది. త్వరలో ప్రాంతం మరో భారీ కేంద్రానికి వేదిక కాబోతోందన్నమాట.
ఎన్‌విడియా భాగస్వామ్యంతో ఏర్పాటు
రిలయన్స్ ఏర్పాటు చేయబోయే భారీ డేటా సెంటర్‌కు అమెరికన్ టెక్ దిగ్గజం ఎన్‌విడియా తన అత్యాధునిక బ్లాక్‌వెల్ ఏఐ చిప్‌లను సమకూర్చనుంది. ఇందుకోసం ఎన్‌విడియాతో ఆర్‌ఐఎల్ గత ఏడాది అక్టోబరులోనే ఒప్పందం కుదుర్చుకుంది.