ఇక పక్కాగా పరపతి సమాచారం
ABN , Publish Date - Jan 07 , 2025 | 06:17 AM
ఖాతాదారుల పరపతి చరిత్రలో ఏమైనా మార్పులు జరిగితే బ్యాంకులు, ఎన్‌బీఎ్‌ఫసీలు ఇక ఆ విషయాన్ని పక్కాగా ఖాతాదారులకు ఎస్‌ఎంఎ్‌సలు, ఈ-మెయిల్స్ ద్వారా అందజేయాలి. అలాగే ఏవైనా సంస్థలు...

బ్యాంకులు, ఎన్‌బీఎ్‌ఫసీలకు ఆర్‌బీఐ ఆదేశాలు
ముంబై: ఖాతాదారుల పరపతి చరిత్రలో ఏమైనా మార్పులు జరిగితే బ్యాంకులు, ఎన్‌బీఎ్‌ఫసీలు ఇక ఆ విషయాన్ని పక్కాగా ఖాతాదారులకు ఎస్‌ఎంఎ్‌సలు, ఈ-మెయిల్స్ ద్వారా అందజేయాలి. అలాగే ఏవైనా సంస్థలు ఖాతాదారుల పరపతి సమాచార నివేదిక (సీఐఆర్) తీసుకున్నా ఆ విషయాన్ని కూడా బ్యాంకులు, ఎన్‌బీఎ్‌ఫసీలు ఖాతాదారులకు తెలియజేయాలి. దీనికి సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. లోపాలను సరిదిద్దుకునేందుకు ఖాతాదారులు సమర్పించిన సమాచారాన్ని బ్యాంకులు, ఎన్‌బీఎ్‌ఫసీలు తిరస్కరించినా, ఆ విషయాన్ని కూడా 30 రోజుల్లోగా ఖాతాదారులకు తెలియజేయాలి. లేకపోతే రోజుకు రూ.100 చొప్పున జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఆర్‌బీఐ తెలిపింది. తాజా ఆదేశాలతో ఖాతాదారుల పరపతి నిర్ధారణ ఎప్పటికప్పుడు నవీకరించబడి, రుణ వితరణ సులభమవుతుందని భావిస్తున్నారు.