స్టార్ట్‌ప్సకు నిబంధనల సంకెళ్లు మోహన్‌దాస్ పాయ్
ABN , Publish Date - Jun 09 , 2025 | 05:43 AM
ప్రభుత్వ స్టార్టప్స్ విధానంపై ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్/సీఎ్‌ఫఓ, ఆరిన్ క్యాపిటల్ చైర్మన్ మోహన్‌దా్‌స పాయ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ నియంత్రణలు ఈ రంగానికి పెద్ద గుది బండలా మారాయన్నారు
న్యూఢిల్లీ: ప్రభుత్వ స్టార్టప్స్ విధానంపై ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్/సీఎ్‌ఫఓ, ఆరిన్ క్యాపిటల్ చైర్మన్ మోహన్‌దా్‌స పాయ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ నియంత్రణలు ఈ రంగానికి పెద్ద గుది బండలా మారాయన్నారు. దీంతో దేశీయ స్టార్టప్స్ తమకు అవసరమైన పెట్టుబడుల్లో 80 శాతం విదేశాల నుంచి సమకూర్చుకోవాల్సి వస్తోందని చెప్పారు. ‘‘2014-2024 మధ్య కాలంలో స్టార్ట్‌ప్సపై చైనా 83,500 కోట్ల డాలర్లు, అమెరికా 2.32 లక్షల కోట్ల డాలర్లు పెట్టుబడిగా పెట్టాయి. మనం కేవలం 16,000 కోట్ల డాలర్లతో సరిపుచ్చాం. మళ్లీ అందులో 80 శాతం నిధులు విదేశాల నుంచి వచ్చాయి. అంటే మన స్థానిక పెట్టుబడులు పెద్దగా లేవని అర్థం’’ అన్నారు. ఈ కారణం చేతే స్టార్టప్స్ సంఖ్యలో మన దేశం 1.65 లక్షల స్టార్ట్‌ప్సతో ప్రపంచంలో మూడో స్థానంలో ఉన్నా, నవ కల్పనలు పెద్దగా లేవని మోహన్ దాస్ పాయ్ స్పష్టం చేశారు. ఈ కంపెనీలను ఆదుకునేందుకు ప్రారంభించిన ఫండ్ ఆఫ్ ఫండ్స్ మూలనిధిని ప్రస్తుత రూ.10,000 కోట్ల నుంచి రూ.50,000 కోట్లకు పెంచాలని కోరారు.
ఇవీ చదవండి:
దేశంలో ట్సాక్స్ ఫ్రీ స్టేట్ గురించి తెలుసా.. ఎంత సంపాదించినా
4 శాతం వడ్డీకే రూ.3లక్షల లోన్.. రైతులకు కేంద్రం ఆఫర్..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..