Share News

Maruti Suzuki: మారుతి లాభం రూ.3,792 కోట్లు

ABN , Publish Date - Aug 01 , 2025 | 05:44 AM

దేశంలో అతిపెద్ద కార్ల విక్రయ కంపెనీ మారుతి సుజుకీ ఇండియా ఈ జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి రూ.3,792 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని...

Maruti Suzuki: మారుతి లాభం రూ.3,792 కోట్లు

న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద కార్ల విక్రయ కంపెనీ మారుతి సుజుకీ ఇండియా ఈ జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి రూ.3,792 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాదిలో ఇదే కాలానికి గడించిన రూ.3,760 కోట్ల లాభంతో పోలిస్తే అతి స్వల్పంగా పెరిగింది. దేశీయంగా కంపెనీ వాహన విక్రయాలు 4.5 శాతం తగ్గినప్పటికీ, ఎగుమతులు ఏకంగా 37.4 శాతం పెరగడం కంపెనీ లాభదాయకతకు తోడ్పడింది. కాగా, ఈ జూన్‌ క్వార్టర్‌లో మారుతి సుజుకీ మొత్తం ఆదాయం రూ.40,493 కోట్లకు చేరింది. మొత్తం వాహన విక్రయాలు 1.1 శాతం పెరుగుదలతో 5,27,861 యూనిట్లకు చేరాయి.

Also Read:

మీ ఇన్నర్ స్ట్రెంత్ ఏంటో తెలుసుకోవాలనుందా?

ఉలిక్కి పడేలా చేసిన ఫిర్యాదు.. తవ్వకాల్లో శవాలు

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Aug 01 , 2025 | 05:44 AM