Share News

లాభాల్లోకి మార్కెట్‌

ABN , Publish Date - May 30 , 2025 | 03:43 AM

ట్రంప్‌ విధించిన ప్రతీకార సుంకాలను అమెరికన్‌ కోర్టు నిలిపివేయడంతో గురువారం మార్కెట్‌ తిరిగి పునరుజ్జీవం బాట పట్టింది. రెండు రోజుల నష్టాలకు స్వస్తి పలికి...

లాభాల్లోకి మార్కెట్‌

ముంబై: ట్రంప్‌ విధించిన ప్రతీకార సుంకాలను అమెరికన్‌ కోర్టు నిలిపివేయడంతో గురువారం మార్కెట్‌ తిరిగి పునరుజ్జీవం బాట పట్టింది. రెండు రోజుల నష్టాలకు స్వస్తి పలికి ఈక్విటీ సూచీలు లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్‌ 320.70 పాయింట్లు పెరిగి 81,633.02 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 504.57 పాయింట్ల వృద్ధితో 81,816.89 పాయింట్లను తాకింది. నిఫ్టీ 81.15 పాయింట్ల లాభంతో 24,833.60 వద్ద క్లోజయింది. నెలవారీ కాంట్రాక్టుల ముగింపు దినాన్ని పురస్కరించుకుని సూచీ భారీ ఆటుపోట్లకు గురయింది. ఆటుపోట్ల ట్రేడింగ్‌లో మెటల్‌, రియల్టీ, ఫార్మా, ఐటీ సూచీలు లాభపడ్డాయి.

ఇవీ చదవండి:

భారత్ కంటే వెనకబడ్డ జపాన్.. అసలు ఆ దేశంలో ఏం జరుగుతోందో తెలిస్తే..

నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. జపాన్‌ను ఓవర్ టేక్ చేసిన వైనం

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 30 , 2025 | 04:27 AM