Market Outlook: ఆచితూచి అడుగేయండి
ABN , Publish Date - Nov 17 , 2025 | 05:49 AM
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం మిశ్రమంగా చలించే అవకాశం ఉంది. అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్‌కు ముగింపు పలికినప్పటికీ ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లపై సందిగ్దత, మళ్లీ కరెన్సీ ప్రింట్ చేస్తుండటం ప్రతికూలంగా...
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం మిశ్రమంగా చలించే అవకాశం ఉంది. అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్‌కు ముగింపు పలికినప్పటికీ ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లపై సందిగ్దత, మళ్లీ కరెన్సీ ప్రింట్ చేస్తుండటం ప్రతికూలంగా మారే వీలుంది. మరోవైపు అంతర్జాతీయంగా రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఎంపిక చేసుకున్న షేర్లలోనే పెట్టుబడులు పెట్టడం మంచిది. ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంకులు, చమురు, ఇన్‌ఫ్రా, తయారీ, కమోడిటీస్ రంగాల షేర్లు బలాన్ని ప్రదర్శిస్తున్నాయి.
స్టాక్ రికమండేషన్స్
బీడీఎల్: జీవితకాల గరిష్ఠం తర్వాత 32 శాతం మేర దిద్దుబాటుకు లోనైన ఈ కౌంటర్‌లో సెప్టెంబరు నుంచి మంచి బేస్ ఏర్పడింది. సెప్టెంబరు త్రైమాసికంలో మంచి ఫలితాలను ప్రకటించటంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్ల బాట పట్టారు. గత శుక్రవారం భారీ వాల్యూమ్‌తో రూ.1,613 ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.1,600 శ్రేణిలో పొజిషన్ తీసుకుని రూ.1,800 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. స్టాప్‌లాస్ రూ.1,560.
జుబిలెంట్ ఫుడ్‌వర్క్స్: కొన్ని నెలలుగా పతనమవుతూ వస్తున్న ఈ షేరుకు తాజా త్రైమాసిక ఫలితాలతో మంచి డిమాండ్ ఏర్పడింది. రిలేటివ్ స్ట్రెంత్, వాల్యూమ్ క్రమంగా పెరుగుతున్నాయి. గత శుక్రవారం రూ.615 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.600 పై స్థాయిలో ప్రవేశించి రూ.675/690 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. స్టాప్‌లాస్ రూ.580.
స్విగ్గీ: మే నెల నుంచి సెప్టెంబరు మధ్య 50 శాతం రాబడి ఇచ్చిన ఈ షేరు ప్రస్తుతం డౌన్‌ట్రెండ్‌లో ఉంది. తాజా ఆర్థిక ఫలితాల్లో రెవెన్యూ పెరగటం సానుకూల అంశం. ధర సైతం ఐపీఓ లిస్టింగ్ స్థాయిలో ఉంది. గత శుక్రవారం రూ.393 వద్ద ముగిసిన ఈ షేరును రూ.470/530 టార్గెట్ ధరతో రూ.390 స్థాయిలో అక్యుములేట్ చేసుకోవాలి. స్టాప్‌లాస్ రూ.370.
భారత్ ఎలకా్ట్రనిక్స్: జీవిత కాల గరిష్ఠం తర్వాత 18 శాతం దిద్దుబాటుకు లోనైన ఈ షేరు ప్రస్తుతం బుల్లిష్ బాట పట్టింది. రిలేటివ్ స్ట్రెంత్, వాల్యూమ్ గణనీయంగా పెరుగుతోంది. గత శుక్రవారం రూ.426 వద్ద క్లోజైన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.410 స్థాయిలో ప్రవేశించి రూ.475 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు స్టాప్‌లాస్ రూ.395.
జియో ఫైనాన్స్: ప్రస్తుతం ఈ షేరు స్వల్పకాలిక డౌన్‌ట్రెండ్‌లో పయనిస్తోంది. తిరిగి పుంజుకునేందుకు ప్రయత్నిస్తోంది. గత శుక్రవారం రూ.314 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.380 టార్గెట్ ధరతో రూ.300 పై స్థాయిలో అక్యుములేట్ చేసుకోవాలి. స్టాప్‌లాస్ రూ.290.
- మూర్తి నాయుడు పాదం,
మార్కెట్ నిపుణులు, నిఫ్టీ మాస్టర్
+91 98855 59709
నోట్ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.