Market Faces Profit Taking: మార్కెట్లో లాభాల స్వీకరణ
ABN , Publish Date - Oct 29 , 2025 | 05:41 AM
ఆసియా మార్కెట్ల బలహీన ట్రెండ్ నేపథ్యంలో ఐటీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్, రియల్టీ రంగ షేర్లలో మదుపరులు లాభాల స్వీకరణకు పాల్పడటంతో ప్రామాణిక ఈక్విటీ సూచీలు మంగళవారం నష్టపోయాయి. ఒక దశలో..
ముంబై: ఆసియా మార్కెట్ల బలహీన ట్రెండ్ నేపథ్యంలో ఐటీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్, రియల్టీ రంగ షేర్లలో మదుపరులు లాభాల స్వీకరణకు పాల్పడటంతో ప్రామాణిక ఈక్విటీ సూచీలు మంగళవారం నష్టపోయాయి. ఒక దశలో 560 పాయింట్ల వరకు క్షీణించిన సెన్సెక్స్.. చివరికి 150.68 పాయింట్ల నష్టంతో 84,628.16 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 29.85 పాయింట్లు కోల్పోయి 25,936.20 వద్దకు జారుకుంది. సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 21 నష్టపోయాయి.
ఎంసీఎక్స్‌లో సాంకేతిక సమస్య: మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో సాంకేతిక సమస్య కారణంగా మంగళవారం ట్రేడింగ్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎక్స్ఛేంజ్‌లో ట్రేడింగ్ 4 గంటలకు పైగా ఆలస్యంగా (మధ్యాహ్నం 1.25 గంటలకు) ప్రారంభమైంది. ట్రేడింగ్ కార్యకలాపాలను డిజాస్టర్ రికవరీ సైట్‌కు బదిలీ చేయాల్సి వచ్చింది. దాంతో గోల్డ్, సిల్వర్, ముడి చమురుతో పాటు కాపర్, జింక్, అల్యూమినియం సహా ఇతర కమోడిటీ కాంట్రాక్టుల ట్రేడింగ్‌పై ప్రభావం పడింది.
ఇవి కూడా చదవండి:
Cyclone Montha: పునరావాస శిబిరాల్లో వసతుల కల్పనపై దృష్టి పెట్టాలి: సీఎం చంద్రబాబు
Cyclone Montha: మొంథా తుపాను నేపథ్యంలో రహదారులపై ఆంక్షలు