Share News

రెండేళ్లలో ఐపీఓకి మలబార్‌ గోల్డ్‌

ABN , Publish Date - Jun 02 , 2025 | 02:53 AM

ఆభరణాల రిటైలింగ్‌లోని మలబార్‌ గోల్డ్‌ 2027-28 ఆర్థిక సంవత్సరంలో పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ)కి రావాలని భావిస్తోంది. బంగారం ధరలు రికార్డు గరిష్ఠ స్థాయిలకు చేరినప్పటికీ...

రెండేళ్లలో ఐపీఓకి మలబార్‌ గోల్డ్‌

న్యూఢిల్లీ: ఆభరణాల రిటైలింగ్‌లోని మలబార్‌ గోల్డ్‌ 2027-28 ఆర్థిక సంవత్సరంలో పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ)కి రావాలని భావిస్తోంది. బంగారం ధరలు రికార్డు గరిష్ఠ స్థాయిలకు చేరినప్పటికీ ఈ ఏడాది ఆదాయాల్లో 20 శాతం వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నట్టు కంపెనీ వ్యవస్థాపకుడు, చైర్మన్‌ ఎంపీ అహ్మద్‌ చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం రూ.62,000 కోట్లుంది. విస్తరణ వ్యూహంలో భాగంగా దేశంలో 60, విదేశాల్లో 30 స్టోర్లు ప్రారంభించాలని యోచిస్తున్నట్టు ఆయన తెలిపారు. కాగా స్టాక్‌ మార్కెట్లో లిస్టింగ్‌కు ఇప్పటికే సన్నాహాలు ప్రారంభమయ్యాయన్నారు. దేశవిదేశాల్లో ప్రస్తుతం మలబార్‌ గోల్డ్‌ 391 స్టోర్లను నిర్వహిస్తోంది.

ఇవీ చదవండి:

జూన్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 02 , 2025 | 02:53 AM