Share News

2025-26లో సిఎస్ఆర్ కోసం రూ.150 కోట్లు

ABN , Publish Date - May 30 , 2025 | 04:06 AM

మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎ్‌సఆర్‌) కోసం రూ.150 కోట్లు కేటాయించినట్లు ప్రకటించింది. సీఎ్‌సఆర్‌ కింద దేశవ్యాప్తంగా...

2025-26లో సిఎస్ఆర్ కోసం రూ.150 కోట్లు

మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌

హైదరాబాద్‌: మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎ్‌సఆర్‌) కోసం రూ.150 కోట్లు కేటాయించినట్లు ప్రకటించింది. సీఎ్‌సఆర్‌ కింద దేశవ్యాప్తంగా పలు సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టనున్నట్లు వెల్లడించింది. ఆరోగ్య సంరక్షణ, విద్య, ఆకలి తీర్చటం, పేదరిక నిర్మూలన, మహిళా సాధికారిత, పర్యావరణ పరిరక్షణ, నిరుపేదలకు గృహ నిర్మాణం వంటివి ఇందులో ఉన్నాయి. ఈ నెల 28 న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో వరల్డ్‌ హంగర్‌ డే సందర్భంగా నీతి ఆయోగ్‌ మాజీ సీఈఓ అమితామ్‌ కాంత్‌ మలబార్‌ గ్రూప్‌ తదుపరి దశ సీఎ్‌సఆర్‌ కార్యక్రమాలను ప్రారంభించారు. మలబార్‌ గ్రూప్‌ ప్రధాన సేవా కార్యక్రమం అయిన ది హంగర్‌ ఫ్రీ వరల్డ్‌ కింద భారత్‌ సహా జాంబియా దేశాల్లోని నిరుపేదలకు ప్రతిరోజు 70,000 భోజనాలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. 2025-26లో మొత్తం 2.5 కోట్ల భోజనాలు అందించనున్నట్లు మలబార్‌ గ్రూప్‌ చైర్మన్‌ ఎంపీ అహ్మద్‌ తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో రోజుకు 2,100 మందికి భోజనాలు అందించే ఈ కార్యక్రమాన్ని మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్‌ ఆర్టిస్ట్రీ స్టోర్‌ వద్ద సోమాజీగూడ కార్పొరేటర్‌ సంగీత శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రారంభించారు.


నిరాశ్రయులైన మహిళల కోసం గ్రాండ్‌మా హోమ్స్‌ పేరుతో మలబార్‌ గ్రూప్‌ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. హైదరాబాద్‌, బెంగళూరు, కేరళల్లో ఈ హోమ్స్‌ ద్వారా ఉచిత వసతి, సంరక్షణ సేవలందిస్తోంది. త్వరలో దీన్ని చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ, ముంబై నగరాలకు విస్తరించేందుకు మలబార్‌ గ్రూప్‌ ప్రణాళికలు రచిస్తోంది.


ఇవీ చదవండి:

భారత్ కంటే వెనకబడ్డ జపాన్.. అసలు ఆ దేశంలో ఏం జరుగుతోందో తెలిస్తే..

నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. జపాన్‌ను ఓవర్ టేక్ చేసిన వైనం

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 30 , 2025 | 04:06 AM