Share News

మేక్‌మై ట్రిప్‌లో తగ్గనున్న చైనా వాటా

ABN , Publish Date - Jun 19 , 2025 | 05:23 AM

చైనా కంపెనీల ఈక్విటీలో వాటా కుదించుకుంటున్న భారత కంపెనీ ల జాబితాలో ట్రావెల్‌ బుకింగ్‌ కంపెనీ మేక్‌మై ట్రిప్‌ కంపెనీ చేరింది. ఈ కంపెనీ...

మేక్‌మై ట్రిప్‌లో తగ్గనున్న చైనా వాటా

న్యూఢిల్లీ: చైనా కంపెనీల ఈక్విటీలో వాటా కుదించుకుంటున్న భారత కంపెనీ ల జాబితాలో ట్రావెల్‌ బుకింగ్‌ కంపెనీ మేక్‌మై ట్రిప్‌ కంపెనీ చేరింది. ఈ కంపెనీ ఈక్విటీలో ప్రస్తుతం చైనా కంపెనీ ట్రిప్‌.కామ్‌కు 45.34 శాతం వాటా ఉంది. ఈ వాటాను 19.99 శాతానికి కుదించేందుకు మేక్‌మై ట్రిప్‌ సిద్ధమైంది. ఇందుకోసం చైనా కంపెనీకి ఉన్న వాటా నుంచి 25.35 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. షేర్లుగా మార్చుకోదగిన రుణ పత్రాలు, షేర్ల విక్రయం ద్వారా ఇందుకు అవసరమైన 250 కోట్ల డాలర్లు (సుమారు రూ.21,617 కోట్లు) సమీకరించాలని కంపెనీ నిర్ణయించింది.

ఇవీ చదవండి:

సెకెండ్ హ్యాండ్ కారు కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఐఫోన్, మ్యాక్‌బుక్ రిపేర్ బాధ్యతలు నిర్వహించనున్న టాటా

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 19 , 2025 | 05:23 AM