Financial Rule Changes: పాన్, ఆధార్, క్రెడిట్ స్కోర్ అప్‌డేట్.. 1వ తేదీనుంచి ఏమేం మారనున్నాయంటే..
ABN , Publish Date - Dec 30 , 2025 | 08:05 PM
పలు పాలసీలు, రెగ్యులేటరీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ మార్పుల వల్ల రైతులు, ఉద్యోగులు, యువకులు, సాధారణ జనంపై ప్రభావం పడనుంది. బ్యాంకింగ్ రూల్స్, ఇంధన ధరలు, పలు ప్రభుత్వ స్కీమ్‌లలో అప్‌డేట్స్ చోటుచేసుకోనున్నాయి.
2026, జనవరి 1వ తేదీనుంచి పలు పాలసీలు, రెగ్యులేటరీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ మార్పుల వల్ల రైతులు, ఉద్యోగులు, యువకులు, సాధారణ జనంపై ప్రభావం పడనుంది. బ్యాంకింగ్ రూల్స్, ఇంధన ధరలు, పలు ప్రభుత్వ స్కీమ్‌లలో అప్‌డేట్స్ చోటుచేసుకోనున్నాయి. కొత్త సంవత్సరంలో కొత్త ఏమేం మార్పులు, చేర్పులు రానున్నాయంటే..
పాన్ - ఆధార్ లింకింగ్ తప్పని సరి
ఇప్పటి వరకు మీరు పాన్ - ఆధార్ లింకింగ్ చేయకపోతే బ్యాంకింగ్, ప్రభుత్వ సేవలు పొందే విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. అకౌంట్స్ ఫ్రీజ్ కాకుండా ఉండాలన్నా.. సర్వీసులు బ్లాక్ కాకుండా ఉండాలన్నా తప్పని సరిగా పాన్ - ఆధార్ లింకింగ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు.. పాన్ - ఆధార్ లింకింగ్ చేయకపోతే ట్యాక్స్ ఫైలింగ్, రీఫండ్, యాక్సెస్ విషయంలో ఇబ్బందులు మొదలవుతాయి.
ఎయిత్ పే కమిషన్ అమలు
సెవెన్త్ పే కమిషన్ డిసెంబర్ 31వ తేదీతో ముగియనుంది. దాని స్థానంలో 2026 జనవరి 1వ తేదీ నుంచి ఎయిత్ పే కమిషన్ అమలు కానుంది. తద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు.. పెన్షనర్ల పెన్షన్ల విషయంలో మార్పులు వచ్చే అవకాశం ఉంది.
క్రెడిక్ స్కోర్ అప్‌డేట్
ప్రస్తుతం 15 రోజులకు ఒకసారి మాత్రమే క్రెడిట్ స్కోర్ అప్‌డేట్ అవుతూ ఉంది. 2026, జనవరి 1వ తేదీనుంచి ఇందులో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇకపై ప్రతీ వారం క్రెడిట్ స్కోర్ అప్‌డేట్ అవ్వనుంది. అంటే దానర్థం లోన్ రీపేమెంట్స్, డీఫాల్ట్స్ చాలా వేగంగా మన క్రెడిట్ స్కోర్‌లో రిఫ్లెక్ట్ అవుతాయి. దీంతో నేరుగా మన లోన్ ఎలిజబిలిటీపై ప్రభావం పడనుంది.
ఎల్పీజీ, ఇంధన ధరలు
జనవరి 1వ తేదీనుంచి డొమస్టిక్, కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరలు మారనున్నాయి. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరల్లో కూడా మార్పులు రానున్నాయి. దీంతో సాధారణ జనంతో పాటు విమానాల్లో ఎగిరే వారిపై కూడా ప్రభావం పడనుంది.
పీఎమ్ కిసాన్ కోసం కొత్త ఫార్మర్ ఐడీ
పీఎమ్ కిసాన్ యోజన స్కీమ్ కోసం కొత్త ఫార్మర్ ఐడీ సిస్టమ్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తేనుంది. కొత్తగా అప్లై చేసుకునే వారికి ఇది తప్పని సరి కానుంది. డిజిటల్ ఐడీలో రైతు ల్యాండ్ రికార్డ్స్, పంట వివరాలు, ఆధార్, బ్యాంక్ వివరాలు ఉంటాయి. ఇప్పటికే లబ్ధి పొందుతున్న రైతులకు ఇది అవసరం లేదు. కొత్తవారికి ఇది తప్పని సరి.
ఇవి కూడా చదవండి
ఖలీదా జియా అంత్యక్రియలకు జైశంకర్
డిసెంబర్ 31 సాయంత్రం ఈ ఒక్క పరిహారం చేస్తే చాలు..!