అంతర్జాతీయ ఫార్మా కంపెనీతో దివీస్ ఒప్పందం
ABN , Publish Date - Apr 19 , 2025 | 04:25 AM
అంతర్జాతీయంగా పేరొందిన ఫార్మా కంపెనీతో దీర్ఘకాలిక సరఫరా ఒప్పందం కుదుర్చుకున్నట్లు దివీస్ లేబొరేటరీస్ ప్రకటించింది....
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): అంతర్జాతీయంగా పేరొందిన ఫార్మా కంపెనీతో దీర్ఘకాలిక సరఫరా ఒప్పందం కుదుర్చుకున్నట్లు దివీస్ లేబొరేటరీస్ ప్రకటించింది. అయితే ఆ కంపెనీ పేరును మాత్రం దివీస్ వెల్లడించలేదు. ఈ ఒప్పందం అమలులో భాగంగా తమ తయారీ కేంద్రాల్లో అదనపు సామర్థ్యాల జోడింపుపై రూ.650-700 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్టు ప్రకటించింది. ఈ సొమ్మును అంతర్గల వనరుల ద్వారానే సమీకరించుకోనున్నట్లు దివీస్ తెలిపింది. రెండు కంపెనీల మధ్య కుదిరిన వాణిజ్య నిబంధనావళి ప్రకారం దివీస్.. అడ్వాన్స్‌డ్ ఇంటర్మీడియేటరీలు తయారుచేసి, సరఫరా చేస్తుంది.
Read More Business News and Latest Telugu News