Mahindra and Mahindra: మహీంద్రా లాభం రూ 3673 కోట్లు
ABN , Publish Date - Nov 05 , 2025 | 05:52 AM
మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) లిమిటెడ్.. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో రూ. 3,673 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది...
ముంబై: మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) లిమిటెడ్.. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో రూ. 3,673 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలం (రూ.2,867 కోట్లు)తో పోల్చితే లాభం 28 శాతం వృద్ధి చెందింది. ఆటోమొబైల్‌తో పాటు వ్యవసాయ యంత్రాలు, పరికరాల విభాగాల్లో మెరుగైన పనితీరు కనబరచటం కలిసి వచ్చిందని మహీంద్రా గ్రూప్ సీఈఓ, ఏండీ అనిష్ షా తెలిపారు. త్రైమాసిక సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం కూడా రూ.37,924 కోట్ల నుంచి రూ. 46,106 కోట్లకు పెరిగింది.
ఇవీ చదవండి:
ఈ పని చేయకుంటే.. జనవరి నుంచి పాన్ కార్డు డీయాక్టివేట్!
మెంబర్ పోర్టల్‌లోనే పాస్ బుక్.. ఈపీఎఫ్ఓ కొత్త ఫీచర్
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి