Share News

ఎయిర్‌బస్‌ విడిభాగాల తయారీలోకి మహీంద్రా

ABN , Publish Date - Jun 18 , 2025 | 05:05 AM

మహీంద్రా గ్రూప్‌ అనుబంధ సంస్థ మహీంద్రా ఏరోస్ట్రక్చర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌.. ఎయిర్‌బస్‌, ఎంబ్రాయర్‌ విమానాల విడిభాగాల తయారీలోకి...

ఎయిర్‌బస్‌ విడిభాగాల తయారీలోకి మహీంద్రా

స్పెయిన్‌ కంపెనీతో భాగస్వామ్యం

న్యూఢిల్లీ: మహీంద్రా గ్రూప్‌ అనుబంధ సంస్థ మహీంద్రా ఏరోస్ట్రక్చర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌.. ఎయిర్‌బస్‌, ఎంబ్రాయర్‌ విమానాల విడిభాగాల తయారీలోకి అడుగు పెడుతోంది. ఇందుకోసం స్పెయిన్‌కు చెందిన ఏర్నోవా ఏరోస్పేస్‌ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ కాంట్రాక్టు విలువ 30 కోట్ల డాలర్లు (రూ.2,585 కోట్లు). ఈ కాంట్రాక్టు కింద ఎంబ్రాయర్‌కు చెందిన సి390 మిలీనియం మిలిటరీ రవాణా విమానం సహా పై రెండు కంపెనీల విమానాలకు చెందిన మెటల్‌ సబ్‌ అసెంబ్లీలు, విడిభాగాలు తయారు చేస్తుంది. స్పెయిన్‌, యూకే, పోర్చుగల్‌, బ్రెజిల్‌లలోని ఏర్నోవా కేంద్రాలకు వాటిని సరఫరా చేస్తుంది.

ఇవీ చదవండి:

సెకెండ్ హ్యాండ్ కారు కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఐఫోన్, మ్యాక్‌బుక్ రిపేర్ బాధ్యతలు నిర్వహించనున్న టాటా

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 18 , 2025 | 05:05 AM