లుపిన్ వైజాగ్ ప్లాంటులో అంకాలజీ బ్లాక్ ప్రారంభం
ABN , Publish Date - Nov 13 , 2025 | 06:24 AM
ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్ వద్ద ఉన్న తమ అనుబంధ సంస్థ ప్లాంటులో ప్రత్యేక అంకాలజీ (కేన్సర్) బ్లాక్ ప్రారంభించినట్టు ఫార్మా దిగ్గజం లుపిన్ ప్రకటించింది. ఈ బ్లాకులో కేన్సర్ చికిత్సలో...
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్ వద్ద ఉన్న తమ అనుబంధ సంస్థ ప్లాంటులో ప్రత్యేక అంకాలజీ (కేన్సర్) బ్లాక్ ప్రారంభించినట్టు ఫార్మా దిగ్గజం లుపిన్ ప్రకటించింది. ఈ బ్లాకులో కేన్సర్ చికిత్సలో ఉపయోగించే తుది ఔషధాల తయారీకి అవసరమైన ప్రత్యేక ఏపీఐ ముడి పదార్ధాలను కాంట్రాక్టు డెవల్‌పమెంట్, మాన్యుఫ్యాక్చరింగ్ పద్దతిలో తయారు చేస్తారు. ఈ బ్లాకులోని ప్రాసెస్ డెవల్‌పమెంట్ ల్యాబ్‌ను క్వాలిటీ కంట్రో ల్ లేబోరేటరీతో అనుసంధానం చేసినట్టు లుపిన్ మాన్యుఫ్యాక్చరింగ్ సొల్యూషన్స్ (ఎల్‌ఎంఎస్) సీఈఓ అబ్దెల్‌అజీజ్ టౌమీ తెలిపారు.
ఇవీ చదవండి:
మీ చూపు శక్తివంతమైనదైతే.. ఈ ఫొటోలో తోడేలును 9 సెకెన్లలో కనిపెట్టండి..
మీ మిక్సీ జార్ తిరగడం లేదా.. ఈ సూపర్ ట్రిక్ ఉపయోగించి చూడండి..