రూపాయల్లో విదేశీ చెల్లింపులకు లైన్ క్లియర్
ABN , Publish Date - Jan 17 , 2025 | 05:43 AM
విదేశీ చెల్లింపుల లావాదేవీలను భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) మరింత సులభతరం చేసింది. ఇందుకోసం 1999 నాటి విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనలను....

ముంబై: విదేశీ చెల్లింపుల లావాదేవీలను భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) మరింత సులభతరం చేసింది. ఇందుకోసం 1999 నాటి విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనలను సవరించింది. దీంతో కొన్ని అంతర్జాతీయ చెల్లింపులు మన రూపాయలు లేదా ఆయా దేశాల కరెన్సీల్లో చెల్లించేందుకు అవకాశం ఏర్పడింది. డాలర్‌తో రూపాయి మారకం రేటు నేలచూపులు చూస్తున్న సమయంలోనే ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. స్థానిక కరెన్సీల్లో చెల్లింపులను అనుమతించేందుకు ఆర్‌బీఐ ఇప్పటికే యూఏఈ, ఇండోనేషియా, మాల్దీవులతో ఒప్పందాలు కుదుర్చుకుంది. వాణిజ్య లావాదేవీల్లో రూపాయి చెల్లింపులను ప్రోత్సహించేందుకు ఆర్‌బీఐ 2022 జూలైలోనే స్పెషల్ రూపీ వోస్ట్రో అకౌంట్ (ఎస్‌ఆర్‌వీఏ) పేరుతో ప్రత్యేక ఖాతా తీసుకొచ్చింది. దాంతో అనేక విదేశీ బ్యాం కులు భారత్‌లోని బ్యాంకుల్లో ఈ ఖాతాలు తెరిచాయి.