Share News

LIC : ఎల్‌ఐసీ లాభం రూ.11,056 కోట్లు

ABN , Publish Date - Feb 08 , 2025 | 06:45 AM

ప్రభుత్వ రంగంలోని భారతీయ జీవిత బీమా కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) డిసెంబరుతో ముగిసిన తృతీయ త్రైమాసికంలో రూ.11,056 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికం (రూ.9,444 కోట్లు)తో పోల్చితే లాభం 17 శాతం వృద్ధి

LIC : ఎల్‌ఐసీ లాభం రూ.11,056 కోట్లు

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని భారతీయ జీవిత బీమా కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) డిసెంబరుతో ముగిసిన తృతీయ త్రైమాసికంలో రూ.11,056 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికం (రూ.9,444 కోట్లు)తో పోల్చితే లాభం 17 శాతం వృద్ధి చెందింది. డిసెంబరు త్రైమాసికంలో వ్యయ నిష్పత్తి తగ్గటం ఎంతగానో కలిసి వచ్చిందని ఎల్‌ఐసీ పేర్కొంది. కాగా త్రైమాసిక సమీక్షా కాలంలో నికర ప్రీమియం ఆదాయం రూ.1,17,017 కోట్ల నుంచి రూ.1,06,891 కోట్లకు తగ్గింది. మరోవైపు మొత్తం ఆదాయం కూడా రూ.2,12,447 కోట్ల నుంచి రూ.2,01,994 కోట్లకు తగ్గింది. ఈ కాలంలో వ్యయా లు రూ.18,194 కోట్ల నుంచి రూ.14,416 కోట్లకు తగ్గాయి. వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా ఉత్పత్తుల్లో మార్పులు చేయటంతో పాటు వ్యూహాత్మకంగా వ్యవహరించటం ఎంతగానో కలిసివచ్చిందని ఎల్‌ఐసీ ఎండీ, సీఈఓ సిద్ధార్థ మొహంతి తెలిపారు.

Updated Date - Feb 08 , 2025 | 06:45 AM