Share News

LIC : ప్రపంచంలోని బలమైన బీమా బ్రాండ్లలో ఎల్‌ఐసీకి మూడో స్థానం

ABN , Publish Date - Mar 08 , 2025 | 03:08 AM

ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ)కు మరో ఘనత దక్కింది.

LIC : ప్రపంచంలోని బలమైన బీమా బ్రాండ్లలో ఎల్‌ఐసీకి మూడో స్థానం

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ)కు మరో ఘనత దక్కింది. ప్రపంచంలోని అత్యంత బలమైన బీమా బ్రాండ్లలో ఎల్‌ఐసీకి మూడో స్థానం దక్కింది. ఈ ఏడాదికి గాను విడుదలైన ‘బ్రాండ్‌ ఫైనాన్స్‌ ఇన్సూరెన్స్‌ 100’ నివేదిక ప్రకారం.. ఎల్‌ఐసీ 100లో 88 బ్రాండ్‌ స్ర్టెంత్‌ ఇండెక్స్‌ (బీఐఎస్‌) స్కోర్‌ సాధించింది. 94.4 బీఐఎస్‌ స్కోర్‌తో పోలాండ్‌కు చెందిన పీజెడ్‌యూ ప్రపంచంలోనే అత్యంత బలమైన బీమా బ్రాండ్‌గా నిలిచింది. 93.5 స్కోర్‌తో చైనా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ రెండో స్థానంలో ఉంది.

బ్రాండ్‌ విలువలో 12వ స్థానం: ప్రపంచంలోని అత్యంత విలువైన 100 బీమా బ్రాండ్లలో ఎల్‌ఐసీకి 12వ స్థానం లభించింది. ఎస్‌బీఐ లైఫ్‌ 76వ స్థానంలో ఉంది. భారత్‌ నుంచి ఈ రెండింటికే చోటు జాబితాలో దక్కింది. ఎల్‌ఐసీ ఆర్థిక పనితీరు విషయానికొస్తే, 2024 డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 17 శాతం వృద్ధితో రూ.11,056.47 కోట్లకు పెరిగింది.

Updated Date - Mar 08 , 2025 | 03:23 AM