Share News

LIC Two Endowment Policies: ఎల్‌ఐసీ నుంచి కొత్త పాలసీలు

ABN , Publish Date - Jul 06 , 2025 | 02:51 AM

ప్రభుత్వ రంగంలోని భారతీయ జీవిత బీమా కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ).. మరో రెండు కొత్త ఎండోమెంట్‌ పాలసీలు ప్రారంభించింది. నవ జీవన్‌ శ్రీ, నవ జీవన్‌ శ్రీ సింగిల్‌ ప్రీమియం పేరుతో ప్రారంభించిన ఈ రెండు పాలసీలు...

LIC Two Endowment Policies: ఎల్‌ఐసీ నుంచి కొత్త పాలసీలు

ప్రభుత్వ రంగంలోని భారతీయ జీవిత బీమా కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ).. మరో రెండు కొత్త ఎండోమెంట్‌ పాలసీలు ప్రారంభించింది. నవ జీవన్‌ శ్రీ, నవ జీవన్‌ శ్రీ సింగిల్‌ ప్రీమియం పేరుతో ప్రారంభించిన ఈ రెండు పాలసీలు పొదుపుతో పాటు పాలసీదారులకు ఆర్థిక భద్రత కల్పిస్తాయని తెలిపింది. ఆయా వ్యక్తుల జీవిత కాలంలో వివిధ అవసరాలకు అనుగుణంగా చాలినంత మూలధనాన్ని సమకూర్చేలా ఈ రెండు పాలసీలను రూపొందించారు. ప్రస్తుత వడ్డీ రేట్ల ఆటుపోట్లను దృష్టిలో ఉంచుకుని పాలసీ కాలంలో హామీతో కూడిన అదనపు మొత్తాలకూ వీలు కల్పించారు. ఈ రెండు పాలసీల ప్రత్యేకతలు.

నవ జీవన్‌ శ్రీ పాలసీ

  • ఇది ఒక లిమిటెడ్‌ పీరియడ్‌ ఎండోమెంట్‌ ప్లాన్‌

  • ప్రీమియం చెల్లింపు కాలపరిమితి 6,8,10,12 సంవత్సరాలు

  • 30 రోజుల నుంచి 60 సంవత్సరాల వరకు వయసు ఉన్న వారు ఎవరైనా ఈ పాలసీ తీసుకోవచ్చు

  • పాలసీ కనీస కాలపరిమితి 10 నుంచి 16 సంవత్సరాలు.

  • పాలసీ గరిష్ట కాలపరిమితి 20 సంవత్సరాలు.

  • కనీస బీమా హామీ మొత్తం రూ.5 లక్షలు. గరిష్ఠ పరిమితి లేదు.

నవ జీవన్‌ శ్రీ సింగిల్‌ ప్రీమియం

  • 30 రోజుల నుంచి 60 సంవత్సరాల వరకు వయసున్న వారు ఎవరైనా ఈ పాలసీ తీసుకోవచ్చు

  • ఆప్షన్‌-1 కింద కనీస మెచ్యూరిటీ వయసు 18 సంవత్సరాలు. గరిష్ట మెచ్యూరిటీ వయసు 75 సంవత్సరాలు

  • ఆప్షన్‌-2 కింద మెచ్యూరిటీ వయసు 60వ పుట్టిన రోజుకు దగ్గరలో ఉండాలి

  • పాలసీ కనీస గడువు ఐదేళ్లు, గరిష్ఠ గడువు 20 సంవత్సరాలు

  • కనీస బీమా హామీ మొత్తం రూ.లక్ష. గరిష్ఠ బీమా హామీ మొత్తానికి పరిమితి లేదు.

ఇవి కూడా చదవండి

ఆస్తే లేనప్పుడు మనీలాండరింగ్‌ ఎక్కడిది?

పవర్‌ జోలికొస్తే... పవర్‌ పోతుంది

Updated Date - Jul 06 , 2025 | 02:55 AM