Laurus Labs Q2 Profit Growth: అదరగొట్టిన లారస్ ల్యాబ్స్
ABN , Publish Date - Oct 24 , 2025 | 06:13 AM
లారస్ ల్యాబ్స్.. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో అద్భుతమైన ఫలితాలను ప్రకటించింది. జూలై-సెప్టెంబరు త్రైమాసికాని (క్యూ2)కి గాను కంపెనీ రూ.1,653 కోట్ల రెవెన్యూపై...
క్యూ2 లాభంలో 875ు వృద్ధి
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): లారస్ ల్యాబ్స్.. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో అద్భుతమైన ఫలితాలను ప్రకటించింది. జూలై-సెప్టెంబరు త్రైమాసికాని (క్యూ2)కి గాను కంపెనీ రూ.1,653 కోట్ల రెవెన్యూపై రూ.195 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలం (రూ.20 కోట్లు)తో పోల్చితే లాభం ఏకంగా 875 శాతం వృద్ధి చెందగా ఆదాయం 35 శాతం వృద్ధి చెందిం ది. కాంట్రాక్ట్ డెవల్‌పమెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ (సీడీఎంఓ) విభాగం అద్భుతమైన పనితీరు కనబరచటం సహా జెనరిక్స్‌లో మెరుగైన వ్ధృద్ధి కనబరచటం కలిసివచ్చిందని లారస్ ల్యాబ్స్ సీఈఓ సత్యనారాయణ చావా వెల్లడించారు.
ఇవీ చదవండి:
ఈ పండుగ సీజన్‌లో పతాకస్థాయికి వాణిజ్యం.. చరిత్రలో మొదటిసారి..
రూపాయి విలువ స్థిరీకరణకు ఆర్‌బీఐ ప్రయత్నాలు.. 7.7 బిలియన్ డాలర్ల విక్రయం
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి