Kims Q1 Results: కిమ్స్ లాభాలకు గండి
ABN , Publish Date - Aug 07 , 2025 | 02:12 AM
స్థానిక కృష్ణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లిమిటెడ్ (కిమ్స్) లాభాలకు గండి పడింది. జూన్ త్రైమాసికంలో కంపెనీ రూ.872 కోట్ల ఆదాయంపై రూ.79 కోట్ల నికర లాభం ప్రకటించింది...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): స్థానిక కృష్ణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లిమిటెడ్ (కిమ్స్) లాభాలకు గండి పడింది. జూన్ త్రైమాసికంలో కంపెనీ రూ.872 కోట్ల ఆదాయంపై రూ.79 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కంపెనీ ఆదా యం 27 శాతం, నికర లాభం మాత్రం 9.2 శాతం పడిపోయాయి. దీంతో కంపెనీ నిర్వహణాలాభం 26 శాతం నుంచి 22 శాతానికి తగ్గింది. ఇదే కాలంలో ఒక్కో పడకపై ఆస్పత్రికి వచ్చే సగటు ఆదాయం 11.8 శాతం పెరిగి రూ.43,011కు, ఒక్కో పేషెంట్‌పై వచ్చే సగటు ఆదాయం 9.8 శాతం వృద్ధితో రూ.1,53,094కు చేరినా క్యూ1లో కిమ్స్ హాస్పిటల్ నికర లాభం 9.2 శాతం పడిపోవడం విశేషం. బెంగళూరులో ఏర్పాటు చేసిన కిమ్స్ ఆస్పత్రి ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం నుంచి పని చేస్తుందని కంపెనీ తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి:
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై సీఎం చంద్రబాబు చర్చ