KIMS Hospitals: తగ్గిన కిమ్స్ హాస్పిటల్స్ లాభం
ABN , Publish Date - Nov 08 , 2025 | 06:04 AM
కృష్ణా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్ హాస్పిటల్స్) సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికంలో రూ.965 కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయంపై రూ.72 కోట్ల నికర లాభాన్ని...
కృష్ణా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్ హాస్పిటల్స్) సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికంలో రూ.965 కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయంపై రూ.72 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే ఆదాయం 23.3 శాతం వృద్ధి చెందగా లాభం మాత్రం 42 శాతం తగ్గింది. సమీక్షా త్రైమాసికంలో అన్ని హాస్పిటల్స్ ప్రోత్సాహకర పనితీరును కనబరిచాయని, మహారాష్ట్రలోని థానేలో కొత్తగా ఏర్పాటు చేసిన హాస్పిటల్‌కు అద్భుతమైన స్పందన లభించిందని కిమ్స్ హాస్పిటల్స్ సీఎండీ భాస్కర్ రావు అన్నారు.
ఇవి కూడా చదవండి..
లగేజీ చూసి.. అంతా లారీ అని అనుకున్నారు.. చివరకు ముందు వైపు చూసి షాక్ అయ్యారు..
రోడ్డు పక్కన పొదల్లో పడిపోయిన యువతి.. సమీపానికి వెళ్లి చూడగా..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి