BitChat: ఈ మెసేజింగ్ యాప్‌కు ఇంటర్నెట్ అవసరం లేదు
ABN , Publish Date - Jul 09 , 2025 | 06:05 AM
‘ఎక్స్’గా పేరు మార్చుకున్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విటర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే బిట్‌చాట్ పేరుతో సరికొత్త మెసేజింగ్ యాప్‌ను అభివృద్ధి చేశారు. ప్రస్తుతం బీటా వెర్షన్‌లో...
బిట్‌చాట్‌ను విడుదల చేసిన ట్విటర్ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే
బ్లూటూత్ టెక్నాలజీ ఆధారంగా సందేశాలు పంపే సదుపాయం
న్యూయార్క్: ‘ఎక్స్’గా పేరు మార్చుకున్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విటర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే బిట్‌చాట్ పేరుతో సరికొత్త మెసేజింగ్ యాప్‌ను అభివృద్ధి చేశారు. ప్రస్తుతం బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉన్న ఈ అప్లికేషన్ ద్వారా సందేశాలు పంపేందుకు ఇంటర్నెట్, వైఫై, మొబైల్ నెట్‌వర్క్, ఫోన్ నంబరు, సర్వర్లు, యూజర్ ఐడీ లాంటివేమీ అవసరం లేదు. సమాచార గోప్యతకు అత్యంత ప్రాధాన్యమిచ్చేందుకు బ్లూటూత్ సాంకేతికత ఆధారంగా పనిచేసే ఆఫ్ గ్రిడ్ పీర్-టు-పీర్ మెసేజింగ్ (ఒక వ్యక్తి మరో వ్యక్తికి సందేశాలు పంపే) ప్లాట్‌ఫామ్ ఇది. అంటే, టెలికమ్యూనికేషన్ నెట్‌వర్క్ లేని సమయంలోనూ బ్లూటూత్ మెష్ నెట్‌వర్క్ ద్వారా ఈ యాప్ నుంచి ఒక వ్యక్తి తన సమీప వ్యక్తికి సందేశం పంపేందుకు వీలుంటుందన్నమాట. వాట్సాప్, మెసెంజర్ వంటి సెంట్రలైజ్డ్ (కేంద్రీకృత) మెసేజింగ్ ప్లాట్‌ఫామ్స్‌కు ఇది ప్రత్యామ్నాయం కానుంది.
ఇవీ చదవండి:
సెకెండ్ హ్యాండ్ కారు కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి