Share News

IVRCL Liquidation: ఐవీఆర్‌సీఎల్‌ లిక్విడేషన్‌ మళ్లీ మొదటికి

ABN , Publish Date - Nov 30 , 2025 | 05:42 AM

హైదరాబాద్‌కు చెందిన ఇంజనీరింగ్‌, ప్రొక్యూర్‌మెంట్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ (ఈపీసీ) కంపెనీ ఐవీఆర్‌సీఎల్‌ లిమిటెడ్‌ లిక్విడేషన్‌ (ఆస్తుల అమ్మకం) ప్రక్రియ మళ్లీ...

IVRCL Liquidation: ఐవీఆర్‌సీఎల్‌ లిక్విడేషన్‌ మళ్లీ మొదటికి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌కు చెందిన ఇంజనీరింగ్‌, ప్రొక్యూర్‌మెంట్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ (ఈపీసీ) కంపెనీ ఐవీఆర్‌సీఎల్‌ లిమిటెడ్‌ లిక్విడేషన్‌ (ఆస్తుల అమ్మకం) ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చింది. ఐవీఆర్‌సీఎల్‌ను రూ.1,200 కోట్లకు దక్కించుకున్న బిడ్డర్‌ పీ. ప్రసాద్‌ రెడ్డి నిర్దేశిత సమయం లోగా కంపెనీ రుణదాతలకు చెల్లింపులు జరపడంలో విఫలమయ్యారు. దాంతో ఎస్‌బీఐ నేతృత్వంలోని రుణదాతల కన్సార్షియం ఆరేళ్లుగా (2017 నుంచి) సాగుతున్న ఐవీఆర్‌సీఎల్‌ దివాలా పరిష్కార ప్రక్రియను పునఃప్రారంభించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే, గత లిక్విడేటర్‌ను కూడా మార్చేసింది. ఐవీఆర్‌సీఎల్‌ రుణదాతలకు రూ.14,500 కోట్లకు పైగా బకాయిపడింది.

ఈ వార్తలు కూడా చదవండి..

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో మరో కీలక పరిణామం

రేపు ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. జాగ్రత్త సుమీ!

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 30 , 2025 | 05:42 AM