Share News

ఐటీసీలో వాటా తగ్గించుకున్న బీఏటీ

ABN , Publish Date - May 29 , 2025 | 01:57 AM

ఎఫ్‌ఎంసీజీ, సిగరెట్ల తయారీ సహా భిన్న వ్యాపారాల్లోకి విస్తరించిన దేశీయ కంపెనీ ఐటీసీలో బ్రిటన్‌కు చెందిన బహుళజాతి సంస్థ బ్రిటిష్‌ అమెరికన్‌ టొబాకో (బీఏటీ) వాటా...

ఐటీసీలో వాటా తగ్గించుకున్న బీఏటీ

న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ, సిగరెట్ల తయారీ సహా భిన్న వ్యాపారాల్లోకి విస్తరించిన దేశీయ కంపెనీ ఐటీసీలో బ్రిటన్‌కు చెందిన బహుళజాతి సంస్థ బ్రిటిష్‌ అమెరికన్‌ టొబాకో (బీఏటీ) వాటా తగ్గించుకుంది. ఐటీసీలో 2.5 శాతం వాటాకు సమానమైన 31.3 కోట్ల షేర్లను ఒక్కోటీ రూ.413 చొప్పున మొత్తం రూ.12,927 కోట్లకు విక్రయించింది. బహిరంగ మార్కెట్లో బ్లాక్‌ డీల్స్‌ ద్వారా బుధవారం ఈ వాటా షేర్ల ఉపసంహరణ జరిగింది. ఈ లావాదేవీ అనంతరం ఐటీసీలో బీఏటీ మొత్తం వాటా 25.44 శాతం నుంచి 22.94 శాతానికి తగ్గింది.

ఇవీ చదవండి:

నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. జపాన్‌ను ఓవర్ టేక్ చేసిన వైనం

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 30 , 2025 | 03:07 PM