ITC Buys 24 Mantra Organic: ఐటీసీ గూటికి 24 మంత్ర ఆర్గానిక్
ABN , Publish Date - Apr 18 , 2025 | 01:29 AM
ఐటీసీ గ్రూప్ 24 మంత్ర ఆర్గానిక్ బ్రాండ్‌ను రూ.472.50 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ డీల్‌తో ఐటీసీ ఆర్గానిక్ ఫుడ్ మార్కెట్‌లో తన స్థితిని బలపరిచింది
ఒప్పందం విలువ రూ.472 కోట్లు
న్యూఢిల్లీ: హైదరాబాద్‌కు చెందిన ఆర్గానిక్ ఆహారోత్పత్తుల బ్రాండ్ ‘24 మంత్ర ఆర్గానిక్’ యాజమాన్య సంస్థ శ్రేష్ఠ నేచురల్ బయోప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 100 శాతం వాటాను రూ.472.50 కోట్లకు కొనుగోలు చేసినట్లు దేశీయ ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీ గ్రూప్ గురువారం ప్రకటించింది. ఈ డీల్‌లో భాగంగా తొలుత రూ.400 కోట్ల్లు, కంపెనీ పనితీరు మైలురాళ్లను చేరుకోవడం ఆధారంగా వచ్చే రెండేళ్లలో రూ.72.5 కోట్లు చెల్లించనున్నట్లు తెలిపింది. దేశంలోని ప్రముఖ ఆర్గానిక్ ప్యాకేజ్డ్ ఆహారోత్పత్తుల బ్రాండ్లలో 24 మంత్ర ఆర్గానిక్ ఒకటి. పప్పులు, మసాలాలు, వంటనూనెలు సహా 100కు పైగా ఉత్పత్తులను విక్రయిస్తోందీ సంస్థ. అమెరికా సహా ఇతర దేశాలకూ వ్యాపారాన్ని విస్తరించింది.