Share News

IRDAI Sets: బీమా సంస్థల ఆగడాలకు చెక్‌

ABN , Publish Date - Jul 16 , 2025 | 03:49 AM

బీమా సంస్థలు, బీమా మధ్యవర్తుల ఆగడాలకు చెక్‌ పెట్టేందుకు భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్‌డీఏఐ) సిద్ధమైంది. ఇందుకోసం తన పూర్తి స్థాయి సభ్యుల పర్యవేక్షణలో...

IRDAI Sets: బీమా సంస్థల ఆగడాలకు చెక్‌

  • కమిటీలు ఏర్పాటు చేసిన ఐఆర్‌డీఏఐ

న్యూఢిల్లీ: బీమా సంస్థలు, బీమా మధ్యవర్తుల ఆగడాలకు చెక్‌ పెట్టేందుకు భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్‌డీఏఐ) సిద్ధమైంది. ఇందుకోసం తన పూర్తి స్థాయి సభ్యుల పర్యవేక్షణలో వివిధ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలు బీమా కంపెనీలు, వాటి ఏజెంట్లు తప్పుడు హామీలతో పాలసీలు అమ్మడం, సెటిల్‌మెంట్లలో లోపాలు, పాలసీదారుకులకు సంబంధించిన కీలక డేటా వెల్లడి వంటి ఉల్లంఘనలకు సంబంధించిన ఫిర్యాదులపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటాయి. బీమా సంస్థలు, వాటి ఏజెంట్లు తప్పుడు హామీలతో తమ కు పాలసీలు అంటగట్టడమే గాక, ఏదో ఒక సాకుతో సెటిల్‌మెంట్స్‌లోనూ కోత పెడుతున్నారని ఇటీవల పాలసీదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో వీటికి చెక్‌ పెట్టేందుకు ఐఆర్‌డీఏఐ ఈ కమిటీలను ఏర్పాటు చేసిందని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

క్రెడిట్ కార్డు లేదా.. అయినా క్రెడిట్ స్కోరు పెరగాలంటే..

సైడ్ ఇన్‌కమ్ కోసం ప్రయత్నించే వారి ముందున్న బెస్ట్ ఆప్షన్స్ ఇవే

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 16 , 2025 | 03:49 AM