అంతర్జాతీయ సంకేతాలే కీలకం..!
ABN , Publish Date - Jan 20 , 2025 | 05:44 AM
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం ఆటుపోట్లకు లోనయ్యే అవకాశం కనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేస్తుండటం, డాలర్ ఇండెక్స్, యూఎస్ బాండ్ లాభాలు పెరుగుతుండటం...
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం ఆటుపోట్లకు లోనయ్యే అవకాశం కనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేస్తుండటం, డాలర్ ఇండెక్స్, యూఎస్ బాండ్ లాభాలు పెరుగుతుండటం ప్రతికూల అంశాలు. మరికొన్ని రోజులు బెంచ్‌మార్క్ సూచీలు ఒడుదొడుకులకు గురి కావచ్చు. ఐటీ, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ రంగాల షేర్లు కాస్త జోరు ప్రదర్శిస్తున్నాయి. గత వారం మీడియా, రియల్టీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్, హెల్త్‌కేర్, ఫార్మా షేర్లలో లాభాల స్వీకరణ కనిపించింది. మెటల్, సీపీఎ్‌సఈ, పీఎ్‌సయూ బ్యాంక్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లకు డిమాండ్ పెరిగింది. కేంద్ర బడ్జెట్ సమీపిస్తుండటంతో మదుపరులు అప్రమత్తంగా ఉండటం మంచిది.
స్టాక్ రికమండేషన్స్
ఇండస్ టవర్: గత ఏడాది సెప్టెంబరులో జీవితకాల గరిష్ఠాన్ని తాకిన ఈ షేర్లలో 31 శాతం మేర కరెక్షన్ జరిగింది. కీలక మద్దతు స్థాయి రూ.320 వద్ద తాజాగా ట్రెండ్ రివర్సల్ మొదలైంది. చివరి ఐదు సెషన్లలో నాలుగు సార్లు లాభపడటం, నిఫ్టీతో పోల్చితే 13 శాతం పెరగటం శుభసూచకం. డిసెంబరు త్రైమాసికంలో మెరుగైన ఫలితాలు విడుదల చేయవచ్చన్న అంచనాలు ఉన్నాయి. గత శుక్రవారం ఈ షేరు 2.30 శాతం లాభంతో రూ.362 వద్ద క్లోజైంది. మదుపరులు ఈ కౌంటర్‌లో రూ.350 వద్ద పొజిషన్ తీసుకుని రూ.385/390 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.340 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
మారికో: ప్రస్తుతం ఎఫ్‌ఎంసీజీ రంగం కాస్త బలం ప్రదర్శిస్తోంది. జీవితకాల గరిష్ఠం నుంచి 20 శాతం మేర దిద్దుబాటుకు గురైన ఈ షేరు ప్రస్తుతం కీలక స్థాయిల్లో కదలాడుతోంది. అక్యుములేషన్ జరుగుతోంది. 200 రోజులు, 21 రోజుల సగటు విలువపైన చలిస్తుండటం సానుకూల అంశం. గత శుక్రవారం 1.81 శాతం లాభంతో రూ.664 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.640 వద్ద పొజిషన్ తీసుకుని రూ.720/730 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.625 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
ఆర్‌వీఎన్‌ఎల్: గత ఏడాది జూలైలో రూ.647 వద్ద జీవితకాల గరిష్ఠాన్ని తాకిన ఈ కౌంటర్‌లో 44 శాతం మేర కరెక్షన్ జరిగింది. బడ్జెట్‌లో రైల్వేలకు 20 శాతం మేర కేటాయింపులు పెంచుతారన్న అంచనాలు, ఆకర్షణీయమైన ధరలకు లభిస్తుండటంతో రైల్వే షేర్లపై మదుపరులకు ఆసక్తి పెరుగుతోంది. గత శుక్రవారం 3.71 శాతం లాభంతో రూ.426 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో ఇన్వెస్టర్లు రూ.400/410 శ్రేణిలో ఎంటరై రూ.455 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.390 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
కోల్ ఇండియా: జీవితకాల గరిష్ఠం నుంచి 30 శాతం మేర పతనమైన ఈ కౌంటర్‌లో ప్రస్తుతం మూమెంటమ్ కనిపిస్తోంది. ఇప్పటికే షేరు బాగా పతనమవటంతో ట్రెండ్ రివర్సల్ జరిగే అవకాశం ఉంది. చివరి నాలుగు సెషన్లలోనే ఈ షేరు 8 శాతం మేర పెరిగింది. గత శుక్రవారం రూ.387 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.380 వద్ద పొజిషన్ తీసుకుని రూ.430/450 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.365 స్థాయిని స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.
టాటా కన్స్యూమర్: ఈ షేరు రూ.1,250 స్థాయి వద్ద జీవితకాల గరిష్ఠాన్ని తాకిన తర్వాత 30 శాతం మేర కరెక్షన్‌కు గురైంది. ఆ తర్వాత రూ.880 వద్ద కీలక మద్దతు లభించింది. అప్పటి నుంచి కాస్త పటిష్ఠతను సూచిస్తోంది. గత శుక్రవారం రూ.954 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.940 వద్ద పొజిషన్ తీసుకుని రూ.1,050 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.925 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
మూర్తి నాయుడు పాదం,
మార్కెట్ నిపుణులు, నిఫ్టీ మాస్టర్
+91 98855 59709
నోట్ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.