Share News

IndiGo Cancels Flights: ఇండిగో సంక్షోభం.. 2 రోజుల్లో 200 విమాన సర్వీసుల రద్దు..

ABN , Publish Date - Dec 09 , 2025 | 10:21 AM

ఇండిగో సంక్షోభం కొనసాగుతోంది. నిత్యం పెద్ద సంఖ్యలో విమాన సర్వీసులు రద్దవుతూనే ఉన్నాయి. ప్రయాణీకులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ రోజు కూడా ఏకంగా 90కిపైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి.

IndiGo Cancels Flights: ఇండిగో సంక్షోభం.. 2 రోజుల్లో 200 విమాన సర్వీసుల రద్దు..
IndiGo Cancels Flights

ఇండిగో సంక్షోభం ప్రారంభమై దాదాపు 10 రోజులు కావస్తోంది. అయినప్పటికి సంస్థ పని తీరులో ఎలాంటి మార్పు లేదు. నిత్యం వందల సంఖ్యలో విమాన సర్వీసులు రద్దవుతూనే ఉన్నాయి. నిన్న ఒక్క రోజే 100కు పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఈ రోజు కూడా అదే పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు 92 విమాన సర్వీసులను ఇండిగో రద్దు చేసింది. దేశంలో ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, గోవాలకు సంబంధించిన సర్వీసులు రద్దయ్యాయి. ప్రతీ నిత్యం ఇలా వందకు పైగా సర్వీసుల రద్దు అవుతుండటంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


డిసెంబర్ 9వ తేదీన రద్దయిన ప్రధాన విమాన సర్వీసుల లిస్ట్..

  • 6E 6914 — గువాహటి (GAU) నుండి భువనేశ్వర్ (BBI)

  • 6E 2189 — ఢిల్లీ (DEL) నుండి తిరువనంతపురం (TRV)

  • 6E 6825 — అగర్తల (IXA) నుండి ఢిల్లీ (DEL)

  • 6E 6739 — ఇండోర్ (IDR) నుండి బెంగళూరు (BLR)

  • 6E 415 — కొయంబత్తూరు (CJB) నుండి బెంగళూరు (BLR)

  • 6E 256 — మంగళూరు (IXE) నుండి బెంగళూరు (BLR)

  • 6E 875 — హైదరాబాద్ (HYD) నుండి కోయికోడ్ (CCJ)

  • 6E 525 — సిల్చర్ (IXS) నుండి అగర్తల (IXA)

  • 6E 876 — కోయికోడ్(CCJ) నుండి హైదరాబాద్ (HYD)

  • 6E 525 — అగర్తల (IXA) నుండి బెంగళూరు (BLR)

  • 6E 524 — బెంగళూరు (BLR) నుండి అగర్తల (IXA)

  • 6E 343 — తిరువనంతపురం (TRV) నుండి చెన్నై (MAA)

  • 6E 924 — హైదరాబాద్ (HYD) నుండి ముంబై (BOM)

  • 6E 524 — అగర్తల (IXA) నుండి సిల్చర్ (IXS)

  • 6E 975 — బెంగళూరు (BLR) నుండి కోల్కతా (CCU)

  • 6E 2188 — తిరువనంతపురం (TRV) నుండి ఢిల్లీ (DEL)

  • 6E 6339 — కోల్కతా (CCU) నుండి డిమాపూర్ (DMU)

  • 6E 6914 — డిమాపూర్ (DMU) నుండి గువాహటి (GAU)

  • 6E 596 — గోవా (GOX) నుండి ముంబై (BOM)


ఇవి కూడా చదవండి

మాకు మాట్లాడుకునే అవసరం రాదు.. కోహ్లీతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ఫిల్ సాల్ట్

జీవితంలో ఈ రహస్యాలను ఎవరితోనూ పంచుకోకండి..

Updated Date - Dec 09 , 2025 | 10:23 AM