Share News

Property Valuation India: రూ 16 లక్షల కోట్లు

ABN , Publish Date - Aug 01 , 2025 | 06:15 AM

దేశంలోని అత్యంత విలువైన రియల్టీ కంపెనీల ఆస్తుల విలువ రూ.16 లక్షల కోట్లకు చేరింది. గత ఏడాదిలో రూ.1.4 లక్షల కోట్ల వృద్ధి నమోదైంది.. గురువారం విడుదలైన ‘గ్రోహ్‌-హురున్‌ ఇండియా రియల్‌ ఎస్టేట్‌ 150’ నివేదిక ఈ...

Property Valuation India: రూ 16 లక్షల కోట్లు

దేశంలోని టాప్‌ రియల్టీ కంపెనీల మొత్తం ఆస్తుల విలువ ఇది..

  • అగ్రస్థానంలో డీఎల్‌ఎఫ్‌

  • టాప్‌-10 జాబితాలో అపర్ణ కన్‌స్ట్రక్షన్స్‌

  • గ్రోహ్‌-హురున్‌ ఇండియా రిపోర్టు వెల్లడి

న్యూఢిల్లీ : దేశంలోని అత్యంత విలువైన రియల్టీ కంపెనీల ఆస్తుల విలువ రూ.16 లక్షల కోట్లకు చేరింది. గత ఏడాదిలో రూ.1.4 లక్షల కోట్ల వృద్ధి నమోదైంది.. గురువారం విడుదలైన ‘గ్రోహ్‌-హురున్‌ ఇండియా రియల్‌ ఎస్టేట్‌ 150’ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. గత ఏడాది కాలంలో రియల్‌ ఎస్టేట్‌ రంగ వృద్ధి రేటు 70 శాతం నుంచి 14 శాతానికి పడిపోయినా కంపెనీల ఆస్తుల విలువ మాత్రం ఎగబాకడం విశేషం.

డీఎల్‌ఎఫ్‌ నం.1

దేశీయ రియల్టీ రంగంలో డీఎల్‌ఎఫ్‌ హవా కొనసాగుతోంది. రూ.2.07 లక్షల కోట్ల ఆస్తులతో డీఎల్‌ఎఫ్‌ అగ్రస్థానంలో నిలిచింది. గత ఏడాది కాలంలోనే ఈ కంపెనీ ఆస్తుల విలువ 2.6 శాతం పెరిగింది. లోధా డెవలపర్స్‌ (రూ.1.38 లక్షల కోట్లు), తాజ్‌ గ్రూపు కంపెనీ ఇండియన్‌ హోటల్స్‌ (రూ.1.08 లక్షల కోట్లు), ప్రెస్టీజ్‌ ఎస్టేట్స్‌ (రూ.71,500 కోట్లు) వరుసగా రెండు, మూడు, నాలుగో స్థానాల్లో నిలిచాయి. హైదరాబాద్‌కు చెందిన అపర్ణ కన్‌స్ట్రక్షన్స్‌ రూ.37,400 కోట్ల ఆస్తులతో తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఏడాది కాలంలో ఈ కంపెనీ ఆస్తుల విలువ 12.9 శాతం పెరిగింది.


రియల్టీలో రిచ్‌.. రాజీవ్‌ సింగ్‌

  • స్థిరాస్తి రంగ సంపన్నుల్లో రూ.1.27 లక్షల కోట్ల ఆస్తులతో డీఎల్‌ఎఫ్‌ అధినేత రాజీవ్‌ సింగ్‌ అగ్రస్థానంలో ఉన్నారు.

  • రూ.92,340 కోట్ల ఆస్తులతో రెండో స్థానంలో లోధా డెవలపర్స్‌ అధినేత ఎంపీ లోధా.

  • అదానీ రియల్టీ అధిపతి గౌతమ్‌ అదానీ రూ.52,320 కోట్ల స్థిరాస్తి సంపదతో మూడో స్థానంలో ఉన్నారు.

  • అపర్ణ కన్‌స్ట్రక్షన్‌కు చెందిన ఎస్‌ సుబ్రమణ్యమ్‌ రెడ్డి, సీ వెంకటేశ్వర రెడ్డి వరుసగా 8, 9వ స్థానాల్లో ఉన్నారు.

  • నగరాలవారీగా.. రూ6,96,800 కోట్ల ఆస్తులు, 42 రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలతో ముంబై అగ్ర స్థానంలో ఉంది.

  • 23 కంపెనీలు రూ.1,97,400 కోట్ల ఆస్తులతో రెండో స్థానంలో బెంగళూరు.

  • 16 కంపెనీలు, రూ.86,700 కోట్ల ఆస్తులతో మూడో స్థానంలో ఢిల్లీ.

  • 13 కంపెనీలు, రూ.93,700 కోట్ల ఆస్తులతో నాలుగో స్థానంలో హైదరాబాద్‌.

Also Read:

మీ ఇన్నర్ స్ట్రెంత్ ఏంటో తెలుసుకోవాలనుందా?

ఉలిక్కి పడేలా చేసిన ఫిర్యాదు.. తవ్వకాల్లో శవాలు

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Aug 01 , 2025 | 06:15 AM