Fireside Ventures Report: 2030 నాటికి రిటైల్ రంగం
ABN , Publish Date - Nov 17 , 2025 | 05:40 AM
పెరుగుతున్న ఆదాయాలతో దేశంలో వినియోగ రంగం రాబోయే కాలంలో కొత్త ఉత్తేజం పొందనుంది. దీనికి తోడు వేగంగా విస్తరిస్తున్న డిజిటలైజేషన్, భారీ ఆకాంక్షలున్న వినియోగదారులతో దేశీయ రిటైల్ మార్కెట్ 2030 నాటికి...
87 లక్షల కోట్లకు..
ఫైర్‌సైడ్ వెంచర్స్ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ: పెరుగుతున్న ఆదాయాలతో దేశంలో వినియోగ రంగం రాబోయే కాలంలో కొత్త ఉత్తేజం పొందనుంది. దీనికి తోడు వేగంగా విస్తరిస్తున్న డిజిటలైజేషన్, భారీ ఆకాంక్షలున్న వినియోగదారులతో దేశీయ రిటైల్ మార్కెట్ 2030 నాటికి లక్ష కోట్ల డాలర్ల (రూ.87 లక్షల కోట్లు) మైలురాయిని చేరుకోవచ్చని వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఫైర్‌సైడ్ వెంచర్స్ తాజా నివేదికలో వెల్లడించింది. కేవలం పరిమాణంలోనే కాకుండా భారతీయుల షాపింగ్ ధోరణుల్లో మార్పు సైతం రిటైల్ మార్కెట్‌ను ప్రభావితం చేస్తుందని పేర్కొంది. 2014లో 90ు ఉన్న సాంప్రదాయిక వ్యాపారం 2030 నాటికి 70 శాతానికి పడిపోతుందని ఆ నివేదిక తెలిపింది.
ఇదే సమయంలో ఆధునిక వాణిజ్యం ప్రత్యేకించి ఈ-కామర్స్, క్విక్ కామర్స్, డీ2సీ విభాగాలు వేగంగా విస్తరిస్తాయని పేర్కొంది. దశాబ్ది కాలంలో డీ2సీ, క్విక్ కామర్స్ మొత్తం వాణిజ్యంలో 5 శాతానికి చేరగలవని అంచనా. వినియోగదారులు షాపింగ్‌కు డిజిటల్ ఫార్మాట్లను ఆశ్రయించడంతో బ్రాండెడ్ రిటైల్ రెండింతల పెరుగుదలతో 73,000 కోట్ల డాలర్లకు (రూ.63.51 లక్షల కోట్లు) అంటే మొత్తం రిటైల్ వ్యయంలో సగానికి చేరుతుందని అంచనా వేసింది.