Indian gold market: పసిడీలా
ABN , Publish Date - Aug 01 , 2025 | 06:08 AM
ఈ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత్‌లో గోల్డ్ డిమాండ్ వార్షిక ప్రాతిపదికన 10 శాతం తగ్గి 134.9 టన్నులకు పరిమితమైందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) గురువారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. గత ఏడాది ఇదే కాలానికి...
రిపోర్టులోని మరిన్ని విషయాలు
ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 10% తగ్గిన బంగారం గిరాకీ
135 టన్నులకు పరిమితం
అధిక ధరలే ప్రధాన కారణం
డబ్ల్యూజీసీ రిపోర్టు వెల్లడి
ముంబై: ఈ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత్‌లో గోల్డ్ డిమాండ్ వార్షిక ప్రాతిపదికన 10 శాతం తగ్గి 134.9 టన్నులకు పరిమితమైందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) గురువారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. గత ఏడాది ఇదే కాలానికి పసిడి గిరాకీ 149.7 టన్నులుగా నమోదైంది. విక్రయాల విలువ పరంగా చూస్తే, ఈ జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో బంగారం డిమాండ్ 30 శాతం పెరిగి రూ.1,21,800 కోట్లకు చేరింది. క్రితం సంవత్సరంలో ఇదే సమయానికి డిమాండ్ విలువ రూ.93,850 కోట్లుగా నమోదైంది. సమీక్షా కాలంలో బంగారం ధర తొలిసారిగా రూ.లక్షకు చేరడంతో.. గిరాకీ పరిమాణం తగ్గినప్పటికీ, విలువలో వృద్ధి నమోదైందని డబ్ల్యూజీసీ రీజినల్ సీఈఓ- ఇండియా సచిన్ జైన్ అన్నారు. ఈ ఏడాది ప్రథమార్ధం(జనవరి-జూన్)లో బంగారం గిరాకీ దాదాపు 253 టన్నులుగా ఉండగా.. పూర్తి ఏడాదికి గిరాకీ 600-700 టన్నుల స్థాయిలో ఉండవచ్చని ఆయన అంచనా వేశారు.
అధిక ధరల కారణంగా జూన్ క్వార్టర్‌లో స్వర్ణాభరణాల విక్రయాలు 17 శాతం తగ్గి 88.8 టన్నులకు పరిమితమయ్యాయి. 2024లో ఇదే కాలానికి 106.5 టన్నుల సేల్స్ జరిగాయి. గోల్డ్ జువెలరీ విక్రయాల విలువ మాత్రం 20 ు వృద్ధితో రూ.80,150 కోట్లుగా నమోదైంది.
ఈ ఏప్రిల్-జూన్‌లో బంగారంలో పెట్టుబడులు 7 శాతం పెరిగి 46.1 టన్నులకు చేరగా.. పెట్టుబడుల విలువ ఏకంగా 54 శాతం వృద్ధితో రూ.41,650 కోట్లుగా నమోదైంది. పసిడి దీర్ఘకాలంలో మెరుగైన ప్రతిఫలాలు అందించగలదన్న ఇన్వెస్టర్ల నమ్మకాన్ని ఇది నొక్కి చెబుతోందని సచిన్ జైన్ అన్నారు.
జూన్ క్వార్టర్‌లో భారత్‌లోకి పసిడి దిగుమతులు 34 శాతం తగ్గి 102.5 టన్నులుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే త్రైమాసికంలో దేశంలోకి 150 టన్నుల బంగారం దిగుమతైంది.
సమీక్షా కాలంలో గోల్డ్ రీసైక్లింగ్ (పాత బంగారం పునర్వినియోగం) ఒక శాతం పెరుగుదలతో 23.1 టన్నులుగా నమోదైంది.
ఈ ఏప్రిల్ - జూన్‌లో ప్రపంచవ్యాప్తంగా బంగారం గిరాకీ 3 శాతం పెరిగి 1,249 టన్నులకు చేరింది. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ల (ఈటీఎ్‌ఫ)లోకి పెట్టుబడులు భారీగా పెరగడం ఇందుకు కారణమని డబ్ల్యూజీసీ తెలిపింది. అంతేకాదు, సెంట్రల్ బ్యాంకులు కూడా 166 టన్నుల బంగారం కొనుగోలు చేశాయని రిపోర్టులో వెల్లడించింది.
Also Read:
మీ ఇన్నర్ స్ట్రెంత్ ఏంటో తెలుసుకోవాలనుందా?
ఉలిక్కి పడేలా చేసిన ఫిర్యాదు.. తవ్వకాల్లో శవాలు
For More Andhra Pradesh News and Telugu News..