CII President Sanjeev Puri: ఈ ఏడాది వృద్ధి 6.5 వృద్ధి సీఐఐ
ABN , First Publish Date - 2025-05-12T05:10:40+05:30 IST
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో భారత ఆర్థిక వ్యవస్థ 6.5% వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉందని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ప్రెసిడెంట్...
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో భారత ఆర్థిక వ్యవస్థ 6.5% వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉందని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ప్రెసిడెంట్ సంజీవ్ పురి అన్నారు. ప్రపంచ భౌగోళిక, రాజకీయ పరిణామాల స్వల్పకాలిక ప్రభావాన్ని తట్టుకుని నిలబడగల శక్తి ఆర్థిక వ్యవస్థకున్నదని ఆయన పేర్కొన్నారు. దేశంలో వడ్డీ రేట్ల తగ్గింపు ప్రారంభం కావడం, ద్రవ్యోల్బణం కూడా అదుపులోకి రావడం, ఏప్రిల్ నుంచి ప్రారంభమైన వ్యక్తిగత ఆదాయపు పన్ను రాయితీలు వృద్ధి రేటుపై తమ అంచనాకు ఆధారమని ఆయన చెప్పారు. గ్రామీణ డిమాండు పుంజుకుంటున్నప్పటికీ పట్టణ డిమాండు స్థిరంగా ఒకే స్థాయిలో ఉండిపోయిందని.. అది పుంజుకోవడానికి మరో రెండు త్రైమాసికాలు పట్టవచ్చని సంజీవ్ పురి అన్నారు.