మా ఆర్థిక వ్యవస్థ భేష్
ABN , Publish Date - Apr 28 , 2025 | 02:21 AM
కొన్ని సమస్యలున్నా, భారత ఆర్థిక వ్యవస్థ భవిష్యత్‌కు ఢోకా లేదని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని భారత్‌లో పెట్టుబడులుపెట్టేందుకు...
పెట్టుబడులతో రండి ఆర్‌బీఐ గవర్నర్
వాషింగ్టన్: కొన్ని సమస్యలున్నా, భారత ఆర్థిక వ్యవస్థ భవిష్యత్‌కు ఢోకా లేదని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని భారత్‌లో పెట్టుబడులుపెట్టేందుకు ముందుకు రావాలని అమెరికా పారిశ్రామిక వర్గాలను కోరారు. సిఐఐ-భారత అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక ఏర్పాటు చేసిన సదస్సులో మాట్లాడుతూ అంతర్జాతీయ ఫైనాన్సియల్ మా ర్కెట్లలో ఆటుపోట్లు, అనిశ్చితి ఉన్నా ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా భారత్ 6.5 శాతం వృద్ధిని నమోదు చేస్తుందన్నారు. ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో మరే దేశ జీడీపీ ఈ స్థాయిలో పెరిగే అవకాశం లేదని చెప్పారుు. స్థిరమైన ప్రభుత్వ విధానాలే ఇందుకు కారణమని చెప్పారు. దీర్ఘకాలిక లాభాలు, అవకాశాలు కోరుకునే పారిశ్రామికవేత్తలకు భారత్ చక్కటి మార్కెట్ అని స్పష్టం చేశారు.
భాగస్వామి కూడా : విదేశీ పెట్టుబడులకు భారత్ గమ్య స్థానమేగాక, వారి ఐశ్వర్యంలోనూ భాగస్వామిగా ఉంటుందని మల్హోత్రా అన్నా రు. ఈ భాగస్వామ్యం భారత భవిష్యత్‌నే గాక ప్రపంచ భవిష్యత్‌నూ మార్చివేస్తుందన్నారు. 2010-19 మధ్యకాలంలో భారత జీడీపీ ఏటా సగటున 6.6 శాతం చొప్పున పెరిగితే గత నాలుగేళ్లలో ఏటా సగటున 8.2 శాతం వృద్ధిరేటు సాఽధించిన విషయాన్ని గుర్తు చేశారు. త్వరలోనే భారత్ మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవిర్భవించబోతోందని చెప్పారు.
Read Also: Gold Rates Today: నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు ఇవీ
జీవిత బీమా పాలసీదారులకు రైడర్లతో మరింత రక్షణ
జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌కు ఏం కావాలంటే ?