Stock Market: లాభాలతో మొదలైన సూచీలు.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
ABN , Publish Date - Nov 17 , 2025 | 09:45 AM
అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు కూడా సూచీలకు మద్దతుగా నిలవడంంతో సూచీలు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. దాదాపు అన్ని రంగాలు లాభాలను ఆర్జిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కదలాడుతున్నాయి.
ఈ వారం వెల్లడికానున్న అమెరికా ఎకానమిక్ డేటాపై మదుపర్లు దృష్టి సారించారు. ఆ డేటా ఆధారంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ డిసెంబర్‌లో వడ్డీ రేట్ల విషయంలో నిర్ణయం తీసుకోనుంది. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు కూడా సూచీలకు మద్దతుగా నిలవడంంతో సూచీలు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. దాదాపు అన్ని రంగాలు లాభాలను ఆర్జిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కదలాడుతున్నాయి. (Indian stock market).
గత సెషన్ ముగింపు (84, 562)తో పోల్చుకుంటే సోమవారం ఉదయం దాదాపు 150 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ అదే ట్రెండ్‌ను కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఉదయం 9:45 గంటల సమయంలో సెన్సెక్స్ 254 పాయింట్ల లాభంతో 84, 817 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతానికి 58 పాయింట్ల లాభంతో 25, 967 వద్ద కొనసాగుతోంది (stock market news today).
సెన్సెక్స్‌లో హీరో మోటోకార్ప్, మారికో, కెనరా బ్యాంక్, వోల్టాస్, బ్యాంక్ ఆఫ్ బరోడా మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). గ్లెన్‌మార్క్, ఆస్ట్రాల్ లిమిటెడ్, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, సుప్రీమ్ ఇండస్ట్రీస్, ఫియోనిక్స్ మిల్స్ మొదలైన షేర్లు నష్టాల బాటలో కొనసాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 345 పాయింట్ల లాభంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 367 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 88.72గా ఉంది.
ఇవీ చదవండి:
మీరెప్పుడైనా 'అరోరా బొరియాలిసిస్' చూశారా.?
బీహార్ ఎన్నికలు.. ఆ ఘనత సాధించిన తొలి వ్యక్తి మైథిలీ ఠాకూర్