Share News

Stock market: బుల్‌ బ్యాక్‌ ర్యాలీ!

ABN , Publish Date - Jun 21 , 2025 | 05:10 AM

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధం నేపథ్యంలో ‘బేర్‌’మంటున్న దలాల్‌స్ట్రీట్‌లో మళ్లీ బుల్‌ సందడి చేసింది.

Stock market: బుల్‌ బ్యాక్‌ ర్యాలీ!

  • సెన్సెక్స్‌ 1,046 పాయింట్లు అప్‌ మళ్లీ 25,000 ఎగువకు నిఫ్టీ

ముంబై: ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధం నేపథ్యంలో ‘బేర్‌’మంటున్న దలాల్‌స్ట్రీట్‌లో మళ్లీ బుల్‌ సందడి చేసింది. వరుసగా మూడు రోజులు నష్టపోతూ వచ్చిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. శుక్రవారం భారీగా లాభపడ్డాయి. సెన్సెక్స్‌ 1,046.30 పాయింట్ల (1.29 శాతం) వృద్ధితో 82,408.17 వద్దకు చేరింది. నిఫ్టీ 319.15 పాయింట్లు (1.29 శాతం) ఎగబాకి 25,112.40 వద్ద స్థిరపడింది. సూచీ ఆరు సెషన్ల తర్వాత మళ్లీ 25,000 ఎగువన ముగిసింది. ఈక్విటీ వర్గాల సంపదగా భావించే బీఎ్‌సఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.4.89 లక్షల కోట్ల పెరుగుదలతో రూ.447.70 లక్షల కోట్లకు (5.17 లక్షల కోట్ల డాలర్లు) చేరింది. సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో మారుతి సుజుకీ షేరు మినహా అన్నీ పరుగు తీశాయి. భారతీ ఎయిర్‌టెల్‌ షేరు 3.27 శాతం లాభంతో సూచీ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. ఎం అండ్‌ ఎం, పవర్‌గ్రిడ్‌తో పాటు మార్కెట్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు 2 శాతానికి పైగా పుంజుకున్నాయి. బీఎ్‌సఈలోని మిడ్‌క్యాప్‌ సూచీ 1.20 శాతం, స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ 0.55 శాతం వృద్ధి చెందాయి. రంగాలవారీ సూచీల్లో టెలికాం 2.73 శాతం, రియల్టీ 2.22 శాతం లాభపడగా.. టెక్నాలజీ, క్యాపిటల్‌ గూడ్స్‌, బ్యాంకెక్స్‌, మెటల్‌ ఇండెక్స్‌లు ఒక శాతానికి పైగా పెరిగాయి.


మార్కెట్‌ ర్యాలీకి కారణాలు

  • ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో గణనీయంగా పెరిగిన ముడి చమురు ధరలు మళ్లీ 2 శాతానికి పైగా తగ్గడం ఈక్విటీ మార్కెట్లకు కొంత ఊరటనిచ్చింది. ఈ యుద్ధంలో ఇప్పుడే కలుగజేసుకోబోమని అమెరికా సంకేతాలివ్వడంతో ఇన్వెస్టర్లు క్రూడాయిల్‌లో లాభాలు స్వీకరించారు.

  • మార్కెట్‌ డౌన్‌ ట్రెండ్‌లో బాగా తగ్గి, ఆకర్షణీయ ధరలకు లభిస్తున్న షేర్లలో ఇన్వెస్టర్లు వాల్యూ బైయింగ్‌ జరిపారు. ముఖ్యంగా ఆర్థిక సేవలు, టెలికాం, టెక్నాలజీ రంగ షేర్లకు డిమాండ్‌ భారీగా పెరిగింది.

  • భారత క్యాపిటల్‌ మార్కెట్లో మూడు రోజులుగా కొనుగోళ్లు జరుపుతూ వచ్చిన విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎ్‌ఫఐఐ) వారాంతం ట్రేడింగ్‌లో ఏకంగా రూ.7,940 కోట్ల నికర పెట్టుబడులు పెట్టారు.

ఓస్వాల్‌ పంప్‌ లిస్టింగ్‌: ఈ మంగళవారం ఐపీఓ ముగించుకున్న ఓస్వాల్‌ పంప్స్‌ లిమిటెడ్‌.. స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో షేర్లను నమోదు చేసింది. ఐపీఓ ధర రూ.614తో పోలిస్తే, బీఎ్‌సఈలో కంపెనీ షేరు 2.93 శాతం లాభంతో రూ.632 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించింది. ఒక దశలో 5.72 శాతం ఎగబాకి రూ.649 వద్దకు చేరినప్పటికీ మళ్లీ తగ్గింది. తొలి రోజు ట్రేడింగ్‌ ముగిసేసరికి 1.77 శాతం లాభంతో రూ.624.90 వద్ద ముగిసింది.


ప్రాజెక్ట్‌ ఫైనాన్స్‌ షేర్లకు ఆర్‌బీఐ బూస్ట్‌

మౌలిక సదుపాయాలతో పాటు ఇతర రంగాల ప్రాజెక్ట్‌ ఫైనాన్స్‌ నిబంధనలను ఆర్‌బీఐ సడలించడంతో ఆర్థిక సేవలు, బ్యాంకింగ్‌ షేర్లలో కొనుగోళ్లు పెరిగాయి. ముఖ్యంగా, ప్రభుత్వ రంగ ప్రాజెక్ట్‌ ఫైనాన్స్‌ కంపెనీలైన పీఎ్‌ఫసీ 4.92 శాతం, హడ్కో 4.72 శాతం, ఇరెడా 4.03 శాతం, ఆర్‌ఈసీ 2.96 శాతం బలపడ్డాయి.

హెచ్‌డీబీ ఐపీఓ ధరల శ్రేణి రూ.700-740: ఈ నెల 25న పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ)ను ప్రారంభించనున్న హెచ్‌డీబీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌.. ఇష్యూ ధరల శ్రేణిని రూ.700-740గా నిర్ణయించింది. అనధికార గ్రే మార్కెట్లో పలుకుతున్న కంపెనీ షేరు ధరతో పోలిస్తే 66 శాతం తక్కువ ఇది. ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ అనుబంధ విభాగమైన హెచ్‌డీబీ ఫైనాన్షియల్‌ ఐపీఓ ద్వారా రూ.12,500 కోట్లు సమీకరించనుంది.

  • జూ సంభవ్‌ స్టీల్‌ ట్యూబ్స్‌ రూ.540 కోట్ల ఐపీఓ ఈ నెల 25న ప్రారంభమై 27న ముగియనుంది. ఇష్యూ ధరల శ్రేణి రూ.77-82గా ఖరారు చేసింది.

  • జూ ఆర్థిక సేవలు, టెలికాం, టెక్‌ షేర్లలో జోరుగా కొనుగోళ్లు

  • జూ రూ.5 లక్షల కోట్ల సంపద వృద్ధి

Updated Date - Jun 21 , 2025 | 05:10 AM