Indian Stock Market: రూ 8 లక్షల కోట్లు ఆవిరి
ABN , Publish Date - Dec 11 , 2025 | 06:24 AM
దేశీయ స్టాక్ మార్కెట్‌లో కరెక్షన్ కొనసాగుతోంది. బుధవారంనాడు కూడా కీలక సూచీలు నేల చూపులు చూశాయి. అమ్మకాల ఒత్తిడితో సెన్సెక్స్ 275.01 పాయింట్ల నష్టంతో 84,391.27 వద్ద...
మార్కెట్లో ఆగని కరెక్షన్
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్‌లో కరెక్షన్ కొనసాగుతోంది. బుధవారంనాడు కూడా కీలక సూచీలు నేల చూపులు చూశాయి. అమ్మకాల ఒత్తిడితో సెన్సెక్స్ 275.01 పాయింట్ల నష్టంతో 84,391.27 వద్ద ముగియగా నిఫ్టీ 81.65 పాయింట్ల నష్టంతో 25,758 వద్ద ముగిసింది. గత నెల 11 తర్వాత సెన్సెక్స్, నిఫ్టీ ఇంత కనిష్ఠ స్థాయిలో ముగియడం ఇదే మొదటిసారి. ఈ మూడు రోజుల కరెక్షన్‌లో బీఎ్‌సఈ లిస్టెడ్ కంపెనీల షేర్ల మార్కెట్ విలువ దాదాపు రూ.8 లక్షల కోట్లు తుడిచి పెట్టుకుపోయింది. ఎడతెగని ఎఫ్‌పీఐ అమ్మకాలు, డాలర్‌తో రూపాయి మారకం రేటు పతనం, భారత-అమెరికా వాణిజ్య ఒప్పందంపై కొనసాగుతున్న అనిశ్చితి ప్రస్తుత కరెక్షన్‌కు కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రధాన అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవడం సైతం దేశీయ మార్కెట్‌లో సెంటిమెంట్‌ను దెబ్బతీసిం ది. వడ్డీరేట్లపై బుధవారం రాత్రి వెలువడే అమెరికన్ ఫెడ్ నిర్ణయం, భారత-అమెరికా వాణిజ్య ఒప్పందంపై వెలువడే అధికారిక ప్రకటన వచ్చే కొద్ది రోజుల్లో మార్కెట్ గమనాన్ని నిర్దేసిస్తాయని జియోజిత్ ఇన్వె్‌స్టమెంట్స్ లిమిటెడ్ సంస్థ రీసెర్చి హెడ్ వినోద్ నాయర్ చెప్పారు.
వచ్చే ఏడాది నిఫ్టీ టార్గెట్ 29,120 పాయింట్లు: కోటక్
ప్రస్తుతం ఆటుపోట్లు ఎదుర్కొంటున్నా వచ్చే ఏడాది మార్కెట్ మదుపరులకు మంచి లాభాలే పంచుతుందని ప్రముఖ బ్రోకరేజి సంస్థ కోటక్ సెక్యూరిటీస్ తెలిపింది. నిఫ్టీ కూడా వచ్చే ఏడాది చివరికల్లా 29,120 పాయింట్లకు చేరే అవకాశం ఉందని ఆ సంస్థ ఎండీ, సీఈఓ శ్రీపాల్ షా చెప్పారు. కంపెనీల ఆదాయాలు 17ు వరకు పెరగడం ఇందుకు ప్రధానంగా దోహదం చేయనుందన్నారు. భారత స్టాక్ మార్కెట్‌లో గాలి బుడగలు ఏర్పడుతున్నాయన్న వార్తలను షా తోసిపుచ్చారు. ఎఫ్‌పీఐలు కూడా వచ్చే ఏడాది కొనుగోళ్లకు దిగే అవకాశం ఉందన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
పరువు హత్య ఆరోపణకు ఆధారాలు చూపండి
Read Latest Telangana News and National News