Share News

ఇళ్ల అమ్మకాలకు ధరల పోటు

ABN , Publish Date - Jun 27 , 2025 | 05:00 AM

హైదరాబాద్‌తో సహా దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు నేలచూపులు చూస్తున్నాయి. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో ఈ ఏడు నగరాల్లో...

ఇళ్ల అమ్మకాలకు ధరల పోటు

20% పడిపోయిన అమ్మకాలు: అనరాక్‌

న్యూఢిల్లీ: హైదరాబాద్‌తో సహా దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు నేలచూపులు చూస్తున్నాయి. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో ఈ ఏడు నగరాల్లో 1,20,335 ఇళ్లు, ఫ్లాట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 20 శాతం తక్కువ. రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్‌ గురువారం విడుదల చేసిన ఒక నివేదికలో ఈ విషయం తెలిపింది. పుణె, హైదరాబాద్‌ నగరాల్లో ఈ తగ్గుదల మరింత ఎక్కువగా 27 శాతం వరకు ఉంది. ఈ కాలం లో హైదరాబాద్‌లో అమ్మకాలు 15,085 యూనిట్ల నుంచి 11,040 యూనిట్లకు పడిపోయా యి. చెన్నైలో మాత్రం గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో అమ్మకాలు 11 శాతం పెరిగాయి. గత ఏడాది తొలి 6 నెలలతో పోలిస్తే ధరలు 11 శాతం పెరగడం, జాతీయ, అంతర్జాతీయ ఉద్రిక్తతలు ఇందుకు కారణమని అనరాక్‌ చైర్మన్‌ అనూజ్‌ పురి చెప్పారు.

ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌లో పెరుగుదల: నివాస గృహాల మార్కెట్‌ అంతంత మాత్రంగానే ఉన్నా ఆఫీస్‌ కార్యాలయాలకు మాత్రం మంచి గిరాకీ ఏర్పడింది. దీంతో గత మూడు నెలల్లో (ఏప్రిల్‌-జూన్‌) ఈ ఏడు ప్రధాన నగరాల్లో 178 లక్షల చదరపు అడుగుల లీజుకు సంబంధించిన ఒప్పందాలు జరిగాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 11 శాతం ఎక్కువని రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెన్సీ సంస్థ కోలియర్స్‌ ఇండియా తెలిపింది. ఈ కాలంలో హైదరాబాద్‌లో 32 లక్షల ఎస్‌ఎ్‌ఫటీ ఆఫీస్‌ స్పేస్‌ లీజుకు సంబంధించి ఒప్పందాలు కుదిరాయి.

ఇవి కూడా చదవండి..

వావ్.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు

జూన్ 30లోపు ముగియాల్సిన ఆర్థిక కార్యకలాపాలు ఇవే.. పూర్తి చేశారా లేదా..

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 27 , 2025 | 05:00 AM