Share News

వలసలపై ఉద్యోగుల ఆసక్తి

ABN , Publish Date - Jun 04 , 2025 | 05:39 AM

మన దేశంలోనూ ఉద్యోగుల అభిరుచులు మారిపోతున్నాయి. గతంలోలా ఉన్న ఉద్యోగాన్నే పట్టుకుని వేలాడేందుకు పెద్దగా ఇష్టపడడం లేదు. మంచి, కొత్త బాధ్యతలు, ఉద్యోగాల నిర్వహణలో...

వలసలపై ఉద్యోగుల ఆసక్తి

కొత్త బాధ్యతల కోసం పరుగులు

మైఖెల్‌ పేజ్‌ ఇండియా

న్యూఢిల్లీ: మన దేశంలోనూ ఉద్యోగుల అభిరుచులు మారిపోతున్నాయి. గతంలోలా ఉన్న ఉద్యోగాన్నే పట్టుకుని వేలాడేందుకు పెద్దగా ఇష్టపడడం లేదు. మంచి, కొత్త బాధ్యతలు, ఉద్యోగాల నిర్వహణలో వెసులుబాటు కోసం చూస్తున్నారు. పని చేస్తున్న కంపెనీల్లో ఈ అవకాశాలు లేకపోతే అందుకు అవకాశాలు కల్పించే కంపెనీలకు మారిపోవడానికి ఏ మాత్రం వెనకాడడం లేదు. మైఖెల్‌ పేజ్‌ ఇండియా అండ్‌ సింగపూర్‌ సంస్థ ఒక నివేదికలో ఈ విషయం తెలిపింది. దేశవ్యాప్తంగా దాదాపు 3,000 మంది వృత్తి నిపుణులను సర్వే చేసి ఈ నివేదికను రూపొందించింది. దీంతో ఈ సంవత్సరం 62 శాతం మంది నిపుణులు, ఉన్న కంపెనీల్లోనే జీతాలు పెంచుకుంటే, 37 శాతం మంది ప్రమోషన్లు సంపాదించుకోగలిగారు. ప్రస్తుత ఉద్యోగుల్లో ఎక్కువ మంది ఉద్యోగ భద్రత కంటే ప్రమోషన్లు, జీతాలు, పనిలో వెసులుబాటుకు ప్రాధాన్యత ఇస్తున్నారని మైఖెల్‌ పేజ్‌ ఇండియా సంస్థ సీనియర్‌ ఎండీ నిలయ్‌ ఖండేల్‌వాల్‌ చెప్పారు.

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 04 , 2025 | 05:39 AM