Share News

India Surpasses China: అమెరికాకు స్మార్ట్‌ఫోన్ల ఎగుమతుల్లో చైనాను మించిన భారత్‌

ABN , Publish Date - Jul 30 , 2025 | 05:00 AM

‘భారత్‌లో తయారీ’ ఊపందుకుంది. స్మార్ట్‌ఫోన్ల ఎగుమ తుల్లో మన దేశం సత్తా చాటుతోంది. జూన్‌ త్రైమాసికంలో అమెరికాకు స్మార్ట్‌ఫోన్ల ఎగుమతుల్లో తొలిసారిగా చైనాను అధిగమించింది. 700 కోట్ల డాలర్ల...

India Surpasses China: అమెరికాకు స్మార్ట్‌ఫోన్ల ఎగుమతుల్లో చైనాను మించిన భారత్‌

న్యూఢిల్లీ: ‘భారత్‌లో తయారీ’ ఊపందుకుంది. స్మార్ట్‌ఫోన్ల ఎగుమ తుల్లో మన దేశం సత్తా చాటుతోంది. జూన్‌ త్రైమాసికంలో అమెరికాకు స్మార్ట్‌ఫోన్ల ఎగుమతుల్లో తొలిసారిగా చైనాను అధిగమించింది. 700 కోట్ల డాలర్ల (సుమారు రూ.60,774 కోట్లు) విలువైన స్మార్ట్‌ఫోన్లు అమెరికాకు ఎగుమతి చేసింది. దీంతో గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ త్రైమాసికంలో అమెరికా స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌లో మన దేశం వాటా 13ు నుంచి 44 శాతానికి (240ు వృద్ధి) చేరింది. ఇదే సమయంలో చైనా వాటా 61ు నుంచి 25 శాతానికి పడిపోయింది. ‘జూన్‌ త్రైమాసికంలో తొలిసారిగా అమెరికాకు స్మార్ట్‌ఫోన్ల ఎగుమతిలో మన దేశం చైనాను మించిపోయింది. యాపిల్‌ పెద్ద ఎత్తున ఎగుమతులు పెంచడం, అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు ఇందుకు ప్రధాన కారణం’ అని కెనాలిస్‌ సంస్థ ప్రిన్సిపల్‌ అనలిస్ట్‌ సన్యం చౌరాసియా చెప్పారు.

యాపిల్‌దే హవా: గత త్రైమాసికంలో మన దేశం నుంచి అమెరికాకు ఎగుమతైన 700 కోట్ల డాలర్ల విలువైన స్మార్ట్‌పోన్లలో యాపిల్‌ కంపెనీ వాటా 70ు వరకు ఉంది. తరువాతి స్థానంలో సామ్‌సంగ్‌, మోటారోలా కంపెనీలున్నాయి. యాపిల్‌ లేటెస్ట్‌ మోడల్‌ ఐఫోన్‌ 16 ప్రోను చైనాలో అసెంబుల్‌ చేయిస్తున్నా, మిగతా మోడల్స్‌ను మాత్రం ఎక్కువగా భారత్‌లోనే అసెంబుల్‌ చేయిస్తోంది. త్వరలో విడుదలయ్యే ఐఫోన్‌ 17 మోడల్‌నీ ఎక్కువగా భారత్‌లో అసెంబుల్‌ చేయించేందుకు సిద్ధమవుతోంది.


రూటు మార్చిన కంపెనీలు : గతంలో యాపిల్‌తో సహా ప్రధాన స్మార్ట్‌ఫోన్ల కంపెనీలు చైనా నుంచే ఎక్కువగా స్మార్ట్‌ఫోన్లను దిగుమతి చేసుకునేవి. కొవిడ్‌ తర్వాత యాపిల్‌తో సహా ప్రధాన కంపెనీలు రూటు మార్చాయి. చైనాపై ఎక్కువగా ఆధారపడడాన్ని తగ్గించుకుంటున్నాయి. ఇందుకోసం ‘చైనా ప్లస్‌ వన్‌’ విధానం అనుసరిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

ఆసియా కప్ 2025లో భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‎పై ఏసీసీ క్లారిటీ..

ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 30 , 2025 | 05:00 AM