NITI Aayog CEO: సుంకాలు తగ్గించుకుంటే మనకే మేలు

ABN , First Publish Date - 2025-02-22T04:15:47+05:30 IST

సుంకాలు ఏ దేశాన్నీ రక్షించలేవని.. మన మేలు కోసం వాటిని తగ్గించుకోవాలని నీతి ఆయోగ్‌ సీఈఓ బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం అన్నారు.

NITI Aayog CEO: సుంకాలు తగ్గించుకుంటే మనకే మేలు

  • నీతి ఆయోగ్‌ సీఈఓ బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం

న్యూఢిల్లీ: సుంకాలు ఏ దేశాన్నీ రక్షించలేవని.. మన మేలు కోసం వాటిని తగ్గించుకోవాలని నీతి ఆయోగ్‌ సీఈఓ బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం అన్నారు. శుక్రవారం ఆల్‌ ఇండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ (ఏఐఎంఏ) 69వ వ్యవస్థాపక దినోత్సవ కా ర్యక్రమంలో మాట్లాడుతూ అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగేందుకు భారత్‌కున్న ఐదు ప్రాధాన్యాల్లో ‘ప్రపంచంతో స్వేచ్ఛా వాణిజ్యం’ ఒకటని ఆయన ఈ సందర్భంగా అన్నారు. సుంకాలను తగ్గించుకునేందుకు యూరోపియన్‌ యూనియన్‌, యునైటెడ్‌ కింగ్‌డమ్‌ సహా ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో భారత్‌ తప్పనిసరిగా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవాలన్నారు.

Updated Date - 2025-02-22T04:15:50+05:30 IST