Share News

Finance Minister Nirmala Sitharaman: భారత్‌కు బడా బ్యాంకులు కావాలి

ABN , Publish Date - Nov 07 , 2025 | 01:42 AM

భారత్‌లోనూ ప్రపంచ స్థాయి పెద్ద బ్యాంకు ల అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే భారతీయ రిజర్వ్‌ ...

Finance Minister Nirmala Sitharaman: భారత్‌కు బడా బ్యాంకులు కావాలి

  • ఆర్‌బీఐ, బ్యాంకులతో చర్చలు జరుపుతున్నాం జూఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడి

  • బ్యాంకింగ్‌లో మరిన్ని విలీనాలు, ప్రైవేటీకరణకు అవకాశం జూభగ్గుమన్న ఉద్యోగ సంఘాలు

ముంబై: భారత్‌లోనూ ప్రపంచ స్థాయి పెద్ద బ్యాంకు ల అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ), సంబంధిత బ్యాంకులతో చర్చిస్తున్నట్టు వెల్లడించారు. ఎస్‌బీఐ 12వ బ్యాంకింగ్‌ అండ్‌ ఎకనామిక్‌ కాంక్లేవ్‌- 2025 సదస్సులో ఆమె ఈ విషయం చెప్పారు. మన దేశంలో ప్రపంచ స్థాయి పెద్ద బ్యాంకుల ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకునేందుకు చాలా కసరత్తు చేయాల్సి ఉంటుందని సీతారామన్‌ తెలిపారు. ఇందుకు అవసరమైన సలహాలు, సూచనల కోసం ఆర్‌బీఐ, బ్యాంకులతో చర్చిస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ లేదా విలీనాల ద్వారా ప్రభుత్వం ఇందుకు శ్రీకారం చుట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు.

బడా బ్యాంకులు ఎలా?

అయితే ప్రపంచ స్థాయి పెద్ద బ్యాంకులను మన దేఽశంలో ఏర్పాటు చేయడం ఎలా? అనే అంశాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి వెల్లడించలేదు. దీంతో ప్రస్తుతం ఉన్న 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎ్‌సబీ)ను మరింత కుదించి ఏర్పాటు చేస్తారా? లేక వేరే మార్గమేదైనా ఆలోచిస్తారా? అనే అంశంపై స్పష్టత రావడం లేదు. సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ (ఐఓబీ) వంటి పీఎ్‌సబీల ప్రైవేటీకరణకు నీతి ఆయోగ్‌ నాలుగేళ్ల క్రితమే గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఉద్యోగ సంఘాల వ్యతిరేకత, ఇతర సమస్యల కారణంగా గత నాలుగేళ్లుగా ఈ విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. దీంతో ఐఓబీ, సీబీఐతో పాటు మరో రెండు పీఎ్‌సబీలను ఆర్థికంగా బలంగా ఉన్న ఇతర పీఎ్‌సబీల్లో విలీనం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి.


ఎస్‌బీఐ మార్కెట్‌ క్యాప్‌ రూ.8.86 లక్షల కోట్లు

మరో ఐదేళ్లలో ప్రపంచంలోని టాప్‌-10 బ్యాంకుల్లో ఒకటిగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఇదే సదస్సులో ప్రసంగించిన ఎస్‌బీఐ చైర్మన్‌ చల్లా శ్రీనివాసులు శెట్టి చెప్పారు. గురువారం తమ బ్యాంకు షేర్ల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 10,000 కోట్ల డాలర్లకు (సుమారు రూ.8.86 లక్షల కోట్లు) చేరినట్టు ఆయన వెల్లడించారు. కాగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎఫ్‌డీఐ పరిమితిని ప్రస్తుత 20 శాతం నుంచి 49 శాతానికి పెంచే విషయాన్ని ప్రభుత్వం పరిశీలించాలని ఆయన కోరారు. దీనివల్ల ప్రభుత్వ-ప్రైవేట్‌ బ్యాంకుల మఽధ్య మరింత సమతుల్యత ఏర్పడుతుందన్నారు.ఆ

ప్రైవేటీకరణతో ముప్పే

పీఎ్‌సబీల ప్రైవేటీకరణతో దేశ ప్రయోజనాలకు, ఆర్థిక సమ్మిళితానికి ఎలాంటి ముప్పు లేదని ఇటీవల కేంద్ర ఆర్తిక మంత్రి సీతారామన్‌ చేసిన వ్యాఖ్యలపై బ్యాంకింగ్‌ ఉద్యోగ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. పీఎ్‌సబీలను ప్రైవేటీకరించడం ముమ్మాటికీ దేశ, సామాజిక ప్రయోజనాలకు ముప్పని బ్యాంకింగ్‌ ఉద్యోగులకు సంబంధించిన తొమ్మిది యూనియన్లకు ప్రాతినిధ్యం వహించే యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (యూఎ్‌ఫబీయూ) ఒక ప్రకటన లో తెలిపింది. దీనివల్ల ఉద్యోగ భద్రతతో పాటు బ్యాంకుల్లోని ప్రజల సొమ్ముకూ ఎలాంటి భద్రత ఉండదని హెచ్చరించింది. ప్రైవేటీకరణ కంపెనీలకు మేలు చేస్తుందే తప్ప, ప్రజలకు కాదని స్పష్టం చేసింది. ప్రభుత్వాలు బ్యాంకింగ్‌ రంగాన్ని సామాజిక, రాజ్యాంగ బాధ్యతగా చూడాలే తప్ప, లాభాల కోసం చేసే వ్యాపారంగా చూడకూడదని యూఎ్‌ఫబీయూ కోరింది. ఏ పీఎ్‌సబీని ప్రైవేటీకరించబోమని ప్రభుత్వం హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేసింది.

ఇవి కూడా చదవండి:

Nara Lokesh: ప్రభుత్వ విద్యాలయాల్లో పరిపాలనపై మంత్రి ఆదేశాలు

Agriculture Minister: పరిహారమిచ్చినా ధాన్యం కొంటాం

Updated Date - Nov 07 , 2025 | 07:03 AM