IATA Report: ఐదో అతిపెద్ద విమానయాన మార్కెట్‌గా భారత్
ABN , Publish Date - Aug 05 , 2025 | 05:40 AM
భారత్ ప్రపంచంలో ఐదో అతి పెద్ద విమానయాన సేవల మార్కెట్‌గా అవతరించిందని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) వెల్లడించింది. గత ఏడాది...
న్యూఢిల్లీ: భారత్ ప్రపంచంలో ఐదో అతి పెద్ద విమానయాన సేవల మార్కెట్‌గా అవతరించిందని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) వెల్లడించింది. గత ఏడాది భారత్‌లో 21.1 కోట్ల మంది (జాతీయ, అంతర్జాతీయ) విమాన ప్రయాణం చేశారని, 2023తో పోలిస్తే విమాన ప్రయాణికుల సంఖ్య 11.1 శాతం పెరిగిందని తాజా నివేదికలో వెల్లడించింది. అలాగే, ముంబై-ఢిల్లీ అత్యంత రద్దీ విమానాశ్రయాల జంటల్లో ఒకటని పేర్కొం ది. ప్రపంచవ్యాప్తంగా 350 ఎయిర్‌లైన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఐఏటీఏ రిపోర్టులోని మరిన్ని విషయాలు..
గత ఏడాదికి గాను 87.6 కోట్ల మంది ప్రయాణికులతో అతిపెద్ద విమానయాన మార్కెట్‌గా అమెరికా తన అగ్రస్థానాన్ని కొనసాగించింది. 74.1 కోట్ల ప్రయాణికులతో చైనా రెండో స్థానంలో ఉంది.
ప్రపంచంలోని అత్యంత రద్దీ విమానాశ్రయాల జంటలో ముంబై-ఢిల్లీ 7వ స్థానంలో ఉన్నాయి. గత ఏడాది ఈ ఎయిర్‌పోర్టుల మధ్య 59 లక్షల మంది ప్రయాణించారు. ఈ విషయంలో ఆసియా పసిఫిక్ విమానాశ్రయాల జంటలే అధికం. జెజు-సియోల్ ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయ జంటగా నిలిచింది. గత ఏడాది ఈ రెండు ఎయిర్‌పోర్ట్‌ల మధ్య 1.32 కోట్ల మంది ప్రయాణించారు.
గత ఏడాది అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో బిజినెస్, ఫస్ట్ క్లాస్‌లో ప్రయాణించిన వారి సంఖ్య 11.8 శాతం పెరగగా.. ఎకానమీ క్లాస్ ప్రయాణికుల వృద్ధి 11.5 శాతంగా నమోదైంది. 2024లో అంతర్జాతీయ బిజినెస్, ఫస్ట్ క్లాస్ ప్రయాణికుల మొత్తం సంఖ్య 11.69 కోట్లకు పెరిగింది. ఇది మొత్తం అంతర్జాతీయ ప్రయాణికుల్లో 6 శాతానికి సమానం.
ఇవి కూడా చదవండి
ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి