కార్లు, రసాయనాలపై తగ్గనున్న దిగుమతి సుంకాలు!
ABN , Publish Date - Feb 28 , 2025 | 02:18 AM
మన దేశానికీ ట్రంప్ ‘పరస్పర సుంకాల’ భయం పట్టుకుంది. ఈ హెచ్చరికల నుంచి తప్పించుకునేందుకు కార్లు, రసాయనాలు, కొన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులు, కీలక ఔషధాలు, వ్యాధి నిర్ధారణ...
వెంటాడుతున్న ట్రంప్ సుంకాల హెచ్చరికలు.. కసరత్తు చేస్తున్న మోదీ సర్కారు
న్యూఢిల్లీ: మన దేశానికీ ట్రంప్ ‘పరస్పర సుంకాల’ భయం పట్టుకుంది. ఈ హెచ్చరికల నుంచి తప్పించుకునేందుకు కార్లు, రసాయనాలు, కొన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులు, కీలక ఔషధాలు, వ్యాధి నిర్ధారణ పరికరాలు, ఎలకా్ట్రనిక్ ఉపకరణాలపై దిగుమతి సుంకాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. అమెరికా నుంచి దిగుమతయ్యే హై ఎండ్ బైక్స్, బోర్బన్ విస్కీ వంటి వాటిపై మన దేశం ఇప్పటికే దిగుమతి సుంకాలు తగ్గించింది. అయినా ఈ తగ్గింపు చాలదని, ఇంకా తగ్గించాల్సిందేనని ట్రంప్ సర్కారు కోరుతోంది. లేకపోతే ఏప్రిల్ నుంచి భారత ఎగుమతులపైనా పరస్పర సుంకాలు తప్పవని హెచ్చరించింది.
ప్రత్యేక బృందం ఏర్పాటు
ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో భారత్‌పై పరస్పర సుంకాల ప్రభావం ఎలా ఉంటుందో అంచనా వేసేందుకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం ఇప్పటికే వివిధ మంత్రిత్వ శాఖలు, వివిధ పారిశ్రామిక రంగాల ప్రతినిధులతో చర్చలు జరిపింది. మత్స్య పరిశ్రమ వర్గాలు ఇప్పటికే ఈ బృందాన్ని కలిసి అమెరికా నుంచి దిగుమతయ్యే రొయ్యలపై ఉన్న 30 శాతం దిగుమతి సుంకాన్ని జీరోకి తగ్గించాలని కోరింది. లేకపోతే ఏప్రిల్ నుంచి మన రొయ్యల ఎగుమతులపైనా అమెరికా 30 శాతం దిగుమతి సుంకం విధించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా మత్స్య దిగుమతులపై సుంకాన్ని జీరోకు తగ్గించినా మన పరిశ్రమకు వచ్చే నష్టం పెద్దగా ఉండదని కూడా స్పష్టం చేసింది. పౌలీ్ట్ర పరిశ్రమ కూడా అమెరికా చికెన్, గుడ్లపై దిగుమతి సుంకం తగ్గించినా, దేశీయ పరిశ్రమకు పెద్దగా నష్టం లేదని ఇప్పటికే స్పష్టం చేసినట్టు సమాచారం. అయితే పాడి పరిశ్రమ మాత్రం సుంకాల తగ్గింపును వ్యతిరేకిస్తోంది.
For Business News And Telugu News